Latest Updates
-
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే!
ఆరెంజ్ కేక్ విత్ చాక్లెట్ కేక్-క్రిస్మస్ స్పెషల్
క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.
క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావల్సిన పదార్థాలు:
మైదా: 200g
బేకింగ్ పౌడర్: 1tsp
బేకింగ్ సోడా: 1/2tsp
ఉప్పు: చిటికెడు

కావల్సిన పదార్థాలు:
ఉప్పులేని బట్టర్: 200g
పంచదార: 200g
గుడ్లు: 4
ఆరెంజ్ జ్యూస్: 1/2cup
ఆరెంజ్ జస్ట్: 2tsp

కావల్సిన పదార్థాలు:
నురుగుకోసం:
క్రీమ్: 11/2tsp
పంచదార పొడి: 2 cups
సెమీ స్వీట్ చాక్లెట్: 150g
ఉప్పులేని బట్టర్: 50g
వెనీలా ఎక్సాక్ట్: 1tsp

కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
1. కేక్ కోసం: ముందుగా ఓవెన్ ను 170డిగ్రీ సెంటీగ్రేడ్ కు ప్రీహీట్ చేయాలి.
2. తర్వాత 8అంగుళాల పొడవున్న పాన్ లో నూనెను అప్లై చేయాలి.
3. ఇప్పుడు ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మరియు ఉప్పు వేయాలి.
4. మరో బౌల్లో బటర్ మరియు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.

కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
5. ఇప్పుడు అందులోనే, గుడ్డుకూడా పగలగొట్టి వేసి, బాగా మిక్స్ చేయాలి.
6. అలాగే ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జెస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మైదాలో మిశ్రమంలో పోసి, బాగా మిక్స్ చేయాలి.
8. జారుడుగా కలిపుకొన్న మొత్తం మిశ్రమాన్ని కేక్ పాన్ లో పోసి 40-45నిముషాలు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ నీట్ గా బటయకు వచ్చే వరకూ బేక్ చేసుకోవాలి.
9. తర్వాత పాన్ ను ఓవెన్ నుండి బయటకు తీసి, 5నిముషాలు చల్లారనివ్వాలి.

కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
10. అలాగే, కేక్ ను కూడా పాన్ నుండి తీసి వేరే ట్రేలో పెట్టి చల్లారనివ్వాలి.
11. నురగకోసం: ఒక పాన్ తీసుకొని అందులో చాక్లెట్ మరియు బటర్ రెండూ వేసి, కరిగించాలి. స్టౌ మీద నుండి దించి, గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.
12. ఇప్పుడు అందులోనే వెనీలా ఎక్సాక్ట్ వేసి మిక్స్ చేయాలి.
12. అలాగే, పంచదార పౌడర్ మరియు క్రీమ్ కూడా బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
13. ఇప్పుడు కేక్ చుట్టూ ఉన్న స్టిప్ పీక్ కు తుడిచి పక్కకు తీసి కేక్ కు కరిగించి , చల్లార్చి పెట్టుకొన్న చాక్లెట్ మిశ్రమాన్ని జోడించి కేక్ లో కలిసిపోయేవరకూ అలాగో ఫ్లోడ్ చేసి పెట్టుకోవాలి.
14. ఇప్పుడు అన్నింటి ఒక చోట చేర్చాలి : కేక్ ను రెండు లేయర్స్ గా కట్ చేసుకోవాలి.

కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
15. ఒక కేక్ లేయర్ ను సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీ మీద ఒక పెద్ద క్రీమ్ డోలప్ ఉంచి, నిధానంగా కేక్ మొత్తం సర్ధాలి.
16. తర్వాత మరో లేయర్ కేక్ తో కవర్ చేయాలి. తర్వాత మీకు నచ్చినవిధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే క్రిస్మస్ స్పెషల్ ఆరెంజ్ కేక్ విత్ చాక్లెట్ రెడీ.



Click it and Unblock the Notifications











