సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది!

Posted By:

హల్వా..ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లూరిపోవడం గ్యారెంటీ. దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్లు, పండగల సమయంలో ఇళ్లల్లో దీనిని ఎక్కువగా తయారచేసుకుంటారు. అయితే హల్వాలో బోలెడు వెరైటీలు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫేమస్ హల్వా ఉంటుంది. అయితే దక్షిణ బారతదేశంలో చాలా ఫేమస్ అయిన హల్వా..బాదంతో తయారుచేసేదే.

బాదం హల్వా చేసుకోవడం చాలా ఈజీ. మెత్తగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

South Indian Style Badam Halwa Recipe in Telugu

బాదం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు

-బాదంపప్పు
-చక్కెర
-పాలు
-కుంకుమ పువ్వు
-నెయ్యి

రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..

బాదం హల్వా తయారీ విధానం

-ముందుగా ఒక చిన్నె గిన్నె నిండా బాదంపప్పులను తీసుకొని వాటిని ఒకసారి కడగండి.

-తర్వాత గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసి నానబెట్టండి

-తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కడిగిన బాదంపప్పు, నీళ్లు పోసి మరిగించాలి. బాదంపప్పు మంచిగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేయండి. బాదంపప్పును బయటకు తీసి చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత బాదంపప్పు తొక్కను తీసేయండి.

-తర్వాత మిక్సీ జార్ లో తొక్క తీసేసిన బాదంపప్పు వేయండి, ఇందులోనే కొన్ని పాలు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. మరీ జారుగా ఉండకూడదు. కొంచెం గట్టిగా ఉన్నట్లుగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ ను వేయండి. ఇందులోనే కొంచెం పాలు వేసి బాగా కలుపుకుంటూ వేడి చెయ్యాలి.

-తర్వాత అందులో కుంకుమపువ్వు వేసి ఉంచిన పాలను పోసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత అందులో తగినంత చక్కెర వేసి బాగా కంటిన్యూగా కలుపుకోండి. మిశ్రమం పాన్ అంచుల నుంచి విడిపోతున్నట్లు అయ్యేదాకా బాగా కలుపుతూనే ఉంచాలి. ఈ సమయంలో మంటను తక్కువలో ఉంచాలి.

-హల్వా మిశ్రమం పాన్ అంచుల నుంచి విడిపోతున్న సమయంలో స్టవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత హల్వా మరింత గట్టిపడుతుంది కాబట్టి.. హల్వా కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ నుంచి పాన్ దించేయాలి.

-అంతే సూపర్ టేస్టీ, సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా రెడీ. దీనిని అరటి ఆకులో పెట్టి ఇంట్లో వాళ్లకు కానీ, పిల్లలకు కానీ ఇస్తే ఇంకా ఇంకా కావాలని అడగడం గ్యారెంటీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 21, 2026, 8:15 [IST]
Desktop Bottom Promotion