Latest Updates
-
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.! -
ఇంట్లో శాంతి, ఐక్యత పెరగాలంటే పూర్వీకులు పాటించిన ఆచారాలు -
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.! -
ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు! -
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే
నెయ్యి ఘుమఘుమలతో స్పెషల్ రొయ్యల వేపుడు.. గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్.!
సీ ఫుడ్‌లో చేపల తర్వాత అంతటి స్పెషల్ ఫుడ్ రొయ్యలు. వీటిని వండే విధానం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. రొయ్యల వేపుడు, రొయ్యల కూర, ప్రాన్స్ బిర్యానీ ఇలా చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఈ సారి కొద్దిగా నెయ్యిని జతచేసి ఆ ఘుమఘుమలతో రొయ్యల వేపుడు చేయండి.. ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు.

మాంసకృత్తులు, విటమిన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండే రొయ్యలను రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే రొయ్యలను ఎప్పుడూ చేసుకునేలా రొటీన్ స్టైల్లో కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి.. రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.
నెయ్యి సువాసనతో రొయ్యల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు- అర కేజీ
ఎండు మిర్చి- 12
వెల్లుల్లి- 8
ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
మిరియాలు- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
గసగసాలు- టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
బెల్లం- టీస్పూన్
చింతపండు - నిమ్మకాయ సైజు
ధనియాల పొడి- అర టీస్పూన్
జీడిపప్పు- 6
నిమ్మకాయ- ఒకటి
కరివేపాకు- కొద్దిగా
నెయ్యి- 5 టేబుల్ స్పూన్లు
నెయ్యి సువాసనతో రొయ్యల వేపుడు తయారీ విధానం
ముందుగా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీడిపప్పులో కొన్ని వేడినీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక.. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు వేసి వేగాక చల్లారనివ్వాలి.
ఇప్పుడు మిక్సీలో వేసి వీటితో పాటు నానబెట్టిన ఎండుమిర్చి, జీడిపప్పు, బెల్లం, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జుతో పాటు నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
ఒక గిన్నెలో కడిగిన రొయ్యలను తీసుకుని అందులో పసుపు, ఉప్పు వేసి నిమ్మకాయ రసం పండి బాగా కలుపుకోవాలి.
స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక సగం నెయ్యి వేసి కాగనివ్వాలి. ఇందులో మసాలా మిశ్రమాన్ని వేసి మంచిగా ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
ఇప్పుడు మరో స్టవ్‌పైన పాన్ పెట్టుకుని మిగిలిన నెయ్యి వేసి వేడయ్యాక రొయ్యలను వేసుకోవాలి. రొయ్యల్లోని నీరు పైకి తేలి ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లు సగానికి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆ రొయ్యలను మరో పాన్‌లో ఉడుకుతున్న మసాలా మిశ్రమంలో వేసి బాగా ఉడకనివ్వాలి. నీళ్లు ఇంకిపోయి దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద వేగనివ్వాలి. మంచి సువాసన వస్తుండగా నిమ్మరసం పిండుకోవాలి. చివరిగా ధనియాల పొడి, కరివేపాకు వేసి మరికాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఘీ ప్రాన్స్ ఫ్రై రెడీ.
రొయ్యల వేపుడును అప్పుడప్పుడూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా కడుపు నిండిన భావన కలిగించి.. బరువును నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఒమెగా- 3 యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications