Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అమ్మ చేతి రుచిని గుర్తుకు తెచ్చే గుత్తి వంకాయ కారం..ఎలా చేసుకోవాలంటే
అమ్మ చేతి వంట రుచిని గుర్తుకు తెచ్చే, ఎంతోమందికి ఇష్టమైన కూర గుత్తి వంకాయ కారం. గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన వంటకం, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. వంకాయ లోపల ఘాటైన మసాలాతో నింపి, నూనెలో నెమ్మదిగా వేయించి చేసే ఈ వంటకం చాలా ప్రత్యేకమైనది. గుత్తి వంకాయ కారం అంటే చాలా మందికి కష్టమైన వంటకం అనుకుంటారు, కానీ సరైన పద్ధతిలో చేస్తే చాలా సులభంగా, త్వరగా చేసేయొచ్చు. గుత్తి వంకాయ కారం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
గుత్తి వంకాయ కారం కావలసిన పదార్థాలు
-పల్లీలు - 1/2 కప్పు
-పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
-ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
-శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
-మినపప్పు - 1 టేబుల్ స్పూన్
-ఎండు మిర్చి - 5-6
-గసగసాలు - 1 టీస్పూన్
-వెల్లుల్లి రెబ్బలు - 5-6
-చింతపండు - చిన్న నిమ్మకాయంత
-ఉప్పు - రుచికి సరిపడా
-పసుపు - అర టీస్పూన్
-చిన్న వంకాయలు - అర కేజీ
-నూనె - 4-5 టేబుల్ స్పూన్లు
-ఆవాలు - అర టీస్పూన్
-జీలకర్ర - అర టీస్పూన్
-ఇంగువ - చిటికెడు
-కరివేపాకు - కొద్దిగా
-ఉల్లిపాయ - ఒకటి
-పసుపు - చిటికెడు

తయారుచేసే విధానం
-ముందుగా ఒక పెనం లేదా నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
-అవి కొంచెం రంగు మారిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. మంట తక్కువగా ఉంచి అన్నింటినీ సగం వేగిన తర్వాత గసగసాలు, కొబ్బరి తురుము వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-అన్నీ చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా పొడిలాగా లేదా కొంచెం నీళ్లు కలిపి ముద్దలాగా రుబ్బుకోవాలి. ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమతో సహా ఉంచుకోవాలి. వంకాయ తొడిమ ఉంచడం వల్ల కూర రుచి మరింత పెరుగుతుంది.
-ఇప్పుడు ఒక్కో వంకాయను తీసుకుని, చివరి వరకు కట్ అవ్వకుండా మధ్యలో ప్లస్ గుర్తులా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు వంకాయ లోపల పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి.
-ఈ కట్ చేసిన వంకాయల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కొద్దికొద్దిగా నింపుకోవాలి. అన్ని వంకాయలు నింపిన తర్వాత మిగిలిన మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి.
-ఒక వెడల్పాటి పాన్ లేదా కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ కూరకి మంచి రుచి వస్తుంది.

-నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడించాలి.
-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు మనం మసాలా నింపిన వంకాయలను ఒక్కొక్కటిగా పాన్‌లో పెట్టాలి. వంకాయలన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేయాలి.
-పాన్ మీద మూత పెట్టి మంటను తక్కువగా ఉంచి వంకాయలను మగ్గించాలి. మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ, వంకాయలు నాలుగు వైపులా బాగా వేగేలా చూసుకోవాలి. వంకాయలు మెత్తగా అయ్యేందుకు కొద్దిగా సమయం పడుతుంది.
-వంకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలా పొడిని వంకాయల మీద చల్లుకోవాలి.
-మసాలా పొడిని వంకాయలకు బాగా పట్టేలా మెల్లగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి.
-అంతే నోరూరించే గుత్తి వంకాయ కారం రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications