Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఉల్లిపాయ పకోడీ బోర్ కొట్టిందా? ఈ కరకరలాడే దొండకాయ పకోడీ ట్రై చేయండి..లొట్టలేసుకుంటూ తింటారు!
సాధారణంగా దొండకాయ కూర లేదా ఫ్రై అంటే పిల్లలు ముఖం చాటేస్తారు. కానీ ఇలా పకోడీలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. సాయంత్రం వేళ వేడి వేడి టీ లేదా కాఫీతో పాటు కరకరలాడే దొండకాయ పకోడీ తింటుంటే ఆ రుచే వేరు. ఇది ఉల్లిపాయ పకోడీకి భిన్నంగా, ఇది కొంచెం గట్టిగా, కరకరలాడుతూ, మసాలా రుచితో అద్భుతంగా ఉంటుంది.
సాంబార్ అన్నం లేదా రసంలోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది. కేవలం 20 నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. పెళ్లి భోజనాల్లో వడ్డించే ఈ స్పెషల్ దొండకాయ పకోడీని అంతే రుచితో మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేతగా, గట్టిగా ఉన్న దొండకాయలు: పావు కిలో
శనగపిండి : 4 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్: 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
కారం: 1 నుండి 1.5 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: అర టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
జీడిపప్పు: గుప్పెడు
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఫుడ్ కలర్: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా లేతగా, పచ్చగా ఉన్న దొండకాయలను శుభ్రంగా కడిగి, ఒక పొడి గుడ్డతో తడి లేకుండా తుడవాలి. దొండకాయకు రెండు వైపులా ఉన్న తొడిమలను తొలగించాలి.
-ఇప్పుడు దొండకాయను నిలువుగా సన్నని పొడవాటి ముక్కలుగా కోయాలి. ఒక దొండకాయను నిలువుగా 4 లేదా 6 ముక్కలుగా చీల్చాలి. గుండ్రంగా చక్రాల్లా కోయకూడదు.
-నిలువుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేతితో కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నీరు ఊరుతుంది.
-తర్వాత ఆ మిశ్రమంలో శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్(మొక్క జొన్న పిండి) వేయండి. నీళ్ళు పోయకుండా గట్టిగా నొక్కుతూ కలపండి. ఒకవేళ మరీ పొడిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లను చిలకరించండి. చివరగా కొన్ని కరివేపాకు రెమ్మలు, పల్లీలు కూడా ఈ పిండి మిశ్రమంలో వేసి కలపండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడయ్యాక మంటను మీడియంలో పెట్టి కలిపి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని, నూనెలో విడివిడిగా పడేలా వేయాలి. ముద్దలు ముద్దలుగా వేయకూడదు.
-వెంటనే గరిటతో కలపకుండా, ఒక నిమిషం పాటు వేగనివ్వండి. ఆ తర్వాత నెమ్మదిగా కలుపుతూ అన్ని వైపులా సమానంగా వేయించండి. దొండకాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చి, గలగలలాడే శబ్దం వచ్చే వరకు వేయించాలి.
-బాగా వేగిన తర్వాత, జాలి గరిటతో తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆపేసే ముందు అదే వేడి నూనెలో కొంచెం కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించి పకోడీలపై చల్లుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
