Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
రాత్రి అన్నం మిగిలిపోయిందా? ఇలా క్యాప్సికమ్ రైస్ చేస్తే ఒక్క మెతుకు కూడా మిగలదు
క్యాప్సికమ్ తో ఏ వంటకం చేసినా దాని రుచే వేరు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇది చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కు పర్ఫెక్ట్ రెసిపీ.
ఉదయం చేసినా మధ్యాహ్నానికి అస్సలు పాడవదు, పైగా మసాలా రుచి వల్ల చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు రైతా లేదా అప్పడాలతో దీనిని సర్వ్ చేస్తే ఆ మజానే వేరు. ఇది కేవలం రుచిలోనే కాదు, చూడ్డానికి కూడా రంగులద్దినట్లు చాలా బాగుంటుంది. తక్కువ సమయంలో, అద్భుతమైన రుచితో క్యాప్సికమ్ మసాలా రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించిన అన్నం
క్యాప్సికమ్ ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
టమాటా - 1
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీ స్పూన్
పసుపు - చిటికెడు
కారం - రుచికి సరిపడా
ధనియాల పొడి - 1 టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోండి. అందులో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు రంగు మారాక, క్యూబ్స్ లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. క్యాప్సికమ్ మరీ మెత్తగా అవ్వకూడదు, కాస్త క్రంచీగా ఉంటేనే అన్నంలో రుచిగా తగులుతుంది.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, టమాటా ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
-టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ మంట తగ్గించి.. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టి, నూనె పైకి తేలేవరకు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని ఈ మిశ్రమంలో వేయండి. అన్నం మెతుకులు విరిగిపోకుండా, మసాలా అంతా అన్నానికి పట్టేలా నిదానంగా కలపాలి.
-పులిహోర కలిపినట్లుగా బాగా కలిపి, మూత పెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచండి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ అన్నానికి బాగా పడుతుంది.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే గుమగుమలాడే వేడి వేడి క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications