Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆంధ్రా స్టైల్ కూర కారం..సంవత్సరం పాటు నిల్వ..ఏ కూర వండినా అద్భుతమే!
ఆంధ్రా వంటకాలు అంటేనే ప్రపంచవ్యాప్తంగా "ఘాటు" మరియు "రుచి"కి ప్రసిద్ధి. ఏ కూర వండినా, అందులో ఒక ప్రత్యేకమైన మసాలా వాసన వస్తుంది. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలైన రహస్యం కూర కారం. దీనిని కొన్ని ప్రాంతాలలో మసాలా కారం లేదా సాంబార్ కారం అని కూడా పిలుస్తారు.
కేవలం ఎండు మిరపకాయలను పొడి చేస్తే వచ్చేది సాధారణ కారం. కానీ ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలను నిర్దిష్ట మోతాదులో కలిపి తయారు చేసేదే ఈ కూర కారం. ఇది కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మన పూర్వీకులు రూపొందించిన ఒక అద్భుతమైన రెసిపీ. ఆంధ్రా స్టైల్ కూర కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండు మిరపకాయలు
-మెంతులు
-జీలకర్ర
-ఉప్పు
-ధనియాలు
-వెల్లుల్లి
-పల్లీ నూనె
తయారీ విధానం
-అన్నిటికంటే ముఖ్యమైన దశ ఇది. ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్రను విడివిడిగా మంచి ఎండలో 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. మిరపకాయను విరిస్తే 'టక్' మని శబ్దం వచ్చేలా ఎండాలి. ఇలా చేయడం వల్ల కారం ఎక్కువ రోజులు బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది.
-ముందుగా 3 కేజీల ఎండుమిరపకాయలను కనీసం 4 గంటల పాటు ఎండలో పెట్టండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కేజీ ధనియాలు వేసి మీడియం మంట మీద సువాసన వచ్చి, రంగు కొంచెం మారేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో పావు కేజీ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే స్టవ్ మీద పాన్ లో 100 గ్రాముల మెంతులు వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే స్టవ్ మీద పాన్ లో 100 గ్రాముల ఉప్పు వేసి అందులోని చెమ్మ(తడి)ఆరిపోయేంతవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వేయించినవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని ఎండలో పెట్టుకోవాలి.
-తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఎండిన ఎండుమిరపకాయలు, వేయించి ఎండలో పెట్టుకున్న జీలకర్ర,ధనియాలు,మెంతుల,ఉప్పు వేసి,వీటిలో 100 గ్రాముల పసుపు కొమ్ములు కూడా వేసి కలిపి మిల్లుకి ఇచ్చి కారం పట్టించుకోండి.
-తర్వాత 3 వెల్లుల్లి గడ్డలను పొట్టు తీసేయాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా నీళ్లు లేకుండానే గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత మిల్లుకిచ్చి మెత్తగా పట్టించుకున్న కారంలో ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. ఈ కారంలోనే అర కప్పు పల్లీ నూనె కూడా వేసి కలుపుకోవాలి. అంతే కూర కారం రెడీ.
-మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాలను కాకుండా, ఇంట్లోనే స్వచ్ఛమైన ఆంధ్రా కూర కారాన్ని తయారు చేసుకుంటే రుచి, ఆరోగ్యం మీ సొంతమవుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications