Latest Updates
-
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
మంచూరియన్ రెసిపీస్ అంటే చిన్నాపెద్దా తేడా లేకుండా ఇష్టపడని వారుండరు. జ్యూసీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉంటూ తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ స్నాక్స్‌ని ఇంట్లో చేసుకోవడం కంటే ఎక్కువగా బయటే కొని తింటుంటారు. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ ఇంట్లో కొందరికి కుదరక రిస్క్ తీసుకోలేరు. అయితే ఈ చిన్న టిప్స్ పాటించారంటే రోడ్ సైడ్ ఘుమఘుమలతో అదిరిపోతుంది. వెజ్ మంచూరియన్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

వెజ్ మంచూరియన్ తయారికి కావాల్సిన పదార్థాలు
క్యాబేజ్- ఒకటి
క్యారెట్- రెండు
కార్న్ ఫ్లోర్- కప్పు
మైదా- పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
మిరియాల పొడి- ఒక టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
కారం- టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా

ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- మూడు
వెల్లుల్లి రెబ్బలు- పది
ఉల్లికాడలు- రెండు
క్యాప్సికం- ఒకటి
కొత్తిమీర- కప్పు
వెనిగర్- టీస్పూన్
సోయా సాస్- టీస్పూన్
నెయ్యి- రెండు టీస్పూన్లు
టమాటా సాస్- టీస్పూన్
ఉప్పు- అరటీస్పూన్
వెజ్ మంచూరియన్ తయారీ విధానం
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.!
వెజ్ మంచూరియన్ తయారీ కోసం ముందుగా క్యాబేజ్ పై పొరను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వెడల్పాటి బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ను తొక్క తీసి గ్రేటర్ సాయంతో తురుముకోవాలి.
క్యాబేజ్ ముక్కల్లోనే క్యారెట్ తురుమును కూడా కలుపుకొని అందులోనే మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి నీళ్లు పోయకుండా మబాగా కలుపుకోవాలి. క్యారెట్, క్యాబేజ్‌లోని నీటి శాతం సరిపోతుంది. పిండిని గట్టిగా కలిపిన తర్వాత చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి.

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని బాగా వేడయ్యాక ఈ బాల్స్‌ను వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో టీస్పూన్ల నూనె ఉంచి వేడయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి.
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.!
ఇవన్నీ వేగుతున్నప్పుడు వెనిగర్, సోయాసాస్, టమాటా సాస్ వేసుకుని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా నెయ్యి వేసి కలిపి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కగా అయ్యేవరకు ఉడకనివ్వాలి.
మిశ్రమం చిక్కబడిన తర్వాత మంచూరియా బాల్స్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకొని చివర్లో ఉల్లికాడలు, కొత్తిమీర వేసి కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. హెల్తీ వెజ్ మంచూరియా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
