Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఎండకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..రాగి గంజి లేదా రాగి జావ ఇలా చేసుకొని తాగాల్సిందే..!
వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం అనేక రుగ్మతలకు గురవుతుంది. ఎండలో చల్లగా ఉండేందుకు శీతల పానీయాలు తాగడం వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అందుచేత శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి రాగులతో చేసిన ఆహారాన్ని వేసవికి ప్రత్యేకంగా తయారుచేస్తారు. ముఖ్యంగా వేసవిలో రాగి గంజి లేదా రాగి అంబలి తయారు చేసి ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
ఎందుకంటే ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. రాగి అంబలిని వేసవిలో తాగడం వల్ల కేవలం శరీరాన్ని చల్లగా ఉంచడం మాత్రమే కాదు, బరువు కూడా తగ్గిస్తుంది. ఇంకా రాగి గంజి వేసవిలో తగిలే వడదెబ్బకు సరైన మందు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి జావ లేదా రాగి అంబలిని ఎలా చేస్తారో తెలుసుకోండి? ఇక్కడ చాలా సులభంగా ఒక సాధారణ పద్ధతి ఉంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - 1/2 tsp
పెరుగు లేదా మజ్జిగ - 1 కప్పు
నీరు - 2 నుండి 3 గ్లాసులు
ఉప్పు - రుచి ప్రకారం
తయారు చేసే విధానం:
* ఒక గిన్నెలో రాగి పిండి వేసి అందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాగా
కలపాలి, తర్వాత మిగిలిన నీటిని వేసి కలపాలి.
* తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి రాగుల పిండి మిశ్రమాన్ని ఉంచి 3
నిమిషాలు వేడి చేసి ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ మీడియం మంట మీద
ఉడికించాలి.
* గంజి చిక్కబడేటప్పుడు అందులో ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలిపి స్టవ్
మీద నుంచి దించి చల్లారనివ్వాలి.
* గంజి పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు లేదా మజ్జిగ వేసి కలిపితే
రాగి అంబలి రుచికి సిద్ధంగా ఉంటుంది. మీకు కావాలంటే, మీరు అందులో
సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను జోడించవచ్చు.

రాగి అంబలి తాగడం వల్ల పొందే లాభాలు:
* రాగుల్లో ఉండే ఫైబర్, ఐరన్, క్యాల్షియం, ఐయోడిన్ మరియు ఖనిజాలు
పుష్కలంగా ఉన్నాయి. దాంతో రాగి అంబలి తాగడం వల్ల శరీరానికి కావాల్సిన
పోషకాలు అందుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో వేడి తగ్గించి, చలువ
చేస్తుంది.
* రాగి గంజిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల దీన్ని తాగినప్పుడు
ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. దాంతో ఇతర చిరుతిండ్ల మీద మనస్సు
పోదు. అందువల్ల సులభంగా బరువు తగ్గుతారు.
* రాగి గంజి తాగడం వల్ల బిపి, షుగర్ కంట్రోల్ అవుతాయి.
* రాగి గంజి తాగడం వల్ల పురుషుల్లో వీర్యకణాలు పెరుగుతాయి.
* వేసవిలో రాగి గంజి రెగ్యులర్ గా ఉదయం అల్పాహారానికి బదులుగా దీన్ని
తాగితే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications