Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
వేసవికాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి చల్లని పానీయాలు, నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటుంటాం. ఎండాకాలంలో మన శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని ప్రభావం నేరుగా మన జీర్ణవ్యవస్థపై పడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, డీహైడ్రేషన్ బారిన పడకుండా జీర్ణక్రియ సజావుగా సాగాలన్నా.. మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన అద్భుతమైన వంటకం రైతా. అందులోనూ బూందీ రైతా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. క్షణాల్లో తయారయ్యే ఈ కమ్మని బూందీ రైతాను ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.

బూందీ రైతా తయారీకి కావలసిన పదార్థాలు
బూందీ - ఒక కప్పు
తాజా పెరుగు - ఒకటిన్నర కప్పు
నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
ఎర్ర కారం పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
సన్నగా తరిగిన కొత్తిమీర - కొద్దిగా
బూందీ రైతా తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయండి. ఆ వేడి నీటిలో ఒక కప్పు బూందీని వేసి కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లలో నుంచి బూందీని తీసి, అందులోని నీరంతా పోయేలా సున్నితంగా పిండి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఒకటిన్నర కప్పుల పెరుగు వేసి క్రీమ్ లాగా మారేంతవరకు బాగా గిలక్కొట్టాలి (బీట్ చేయాలి). ఇప్పుడు ఆ పెరుగులో అర టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ కారం,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
పెరుగు మరీ చిక్కగా అనిపిస్తే అందులో ఒక అర కప్పు నీళ్లు పోసి మళ్లీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బూందీని ఈ మిశ్రమంలో వేయాలి.
బూందీ, పెరుగు, మసాలాలు అన్నీ ఒకదానికొకటి బాగా పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుంటే.. నోరూరించే బూందీ రైతా రెడీ.
బూందీ రైతా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బూందీ రైతా కేవలం రుచికరమైన సైడ్ డిష్ మాత్రమే కాదు, వేసవికి తగిన అద్భుతమైన పోషకాహారం కూడా.
జీర్ణక్రియకు మేలు: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇది కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
శక్తినిస్తుంది: శనగపిండితో చేసే బూందీలో శక్తి నిండి ఉంటుంది. ఈ రెండింటి కలయిక శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని అందిస్తుంది.
ఎముకల బలం: పెరుగులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.
బరువు నియంత్రణ: ఎండాకాలంలో ఈ రైతాను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా, బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
