Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్!
ఆదివారం వచ్చిందంటే చాలు.. మనలో చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందులోనూ మటన్ కర్రీ ఉంటే ఆ మజానే వేరు. కూరగాయలతో పోలిస్తే ధర కాస్త ఎక్కువైనా సరే, వారానికోసారైనా మటన్ తినకపోతే సండే ఫీలింగ్ రాదు కదా. అయితే, ఎప్పుడూ చేసుకునే రొటీన్ మటన్ కూరలకు భిన్నంగా ఈ వారం కాస్త కొత్తగా పుల్లటి మామిడికాయతో మటన్ కర్రీ వండి చూడండి.. టేస్ట్ కిర్రాక్ ఉంటుంది.

కారంగా, పుల్లగా, ఘాటుగా ఉండే ఈ కర్రీని అన్నంలో కలుపుకుని తింటే అమృతంలా అనిపిస్తుంది. పెద్దలే కాదు, పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా ఈ మామిడికాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
మామిడికాయ మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
జీడిపప్పు పలుకులు - 10
గసగసాలు - అర టేబుల్ స్పూన్
మటన్ - అరకిలో
నూనె - పావు కప్పు
దాల్చినచెక్క - చిన్న ముక్క
లవంగాలు - 2
యాలకులు - 2
ఉల్లిపాయలు - 2
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పలుకులు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2
పుల్లటి మామిడి ముక్కలు - అర కప్పు
కసూరీ మేథీ - చిటికెడు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
గరం మసాలా - అర టీస్పూన్
వేడి నీళ్లు - తగినన్ని

మామిడికాయ మటన్ కర్రీ తయారీ విధానం
-ముందుగా మటన్ ను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయ పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి అర కప్పు కొలత తీసుకుని సిద్ధం చేసుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. అవి చిటపటలాడాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న మటన్ వేసి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించాలి. మటన్ కాస్త రంగు మారాక జీడిపప్పు పలుకులు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు కప్పుల వేడి నీళ్లు పోసి, కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-మటన్ ఉడికేలోపు మరో పాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. చివరగా గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే మరో రెండు విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, ఇంకో కప్పు వేడి నీళ్లు పోసి కూరను ఉడికించాలి.
-గ్రేవీ దగ్గరపడి నూనె పైకి తేలుతున్న సమయంలో మామిడికాయ ముక్కలు వేయాలి. మీడియం ఫ్లేమ్ లో మరో 10 నిమిషాలు ఉడికించాలి.
-చివరగా గరం మసాలా, కొత్తిమీర తురుము, చేతితో నలిపిన కసూరీ మేథీ చల్లుకుని ఓ ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే నోరూరించే మామిడికాయ మటన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నం, రోటీ, బగారా రైస్ లేదా బిర్యానీలోకి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
