Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
దూది కంటే మెత్తని సొరకాయ చపాతీ..సూపర్ టేస్ట్..ఎలా చేసుకోవాలంటే
సొరకాయ మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణంగా సొరకాయతో ఎక్కువగా పులుసు,ఫ్రై,గారెలు వంటివి తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా సొరకాయతో చపాతీలు ట్రై చేశారా? అద్భుతం అంటే అద్భుతమే. దీని రుచి ముందు ఇంకేదీ పనికిరాదు అంటారు. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి బోలెడంత మేలు కూడా చేస్తుంది. గంటల తర్వాత నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోతుంది. సొరకాయ చపాతీలను మీ ఇంట్లోనే దూది కంటే మెత్తగా చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సొరకాయ చపాతీ తయారీకి కావాల్సిన పదార్ధాలు
-సొరకాయ
-జీలకర్ర
-కొత్తిమీర
-కరివేపాకు
-గోధుమ పిండి
-ఉప్పు
-గరం మసాలా
-ఇంగువ
-మిరియాల పొడి
-ఆయిల్

సొరకాయ చపాతీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో రెండున్నర కప్పుల గోధుమ పిండి వేయండి. ఇందులోనే కొంచెం ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 పచ్చిమిర్చి తరుగు, అర టీస్పూన్ గరం మసాలా, రెండు చిటికెళ్ల ఇంగువ, ముప్పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి నీరు పోయకుండానే మెత్తగా పిండుతూ కలుపుకోండి.
-తర్వాత అందులో రెండు కప్పుల సొరకాయ తురుము వేసి గట్టిగా పిండుతూ కలుపుకోండి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కట్ చేసి వేసుకోండి.
-తర్వాత అందులో చిలకరించినట్లుగా కొన్ని నీళ్లు పోసి పిండిని సెమీ సాఫ్ట్ గా కలుపుకోండి.
-అందులోనే 2 టీస్పూన్ల ఆయిల్ కూడా వేసి పిండి మిశ్రమాన్ని బాగా వత్తుకొని కనీసం పావు గంట సేపు పక్కన పెట్టుకోండి.
-తర్వాత నిమ్మకాయ సైజు అంత పిండి ముద్దలు తీసుకొని ఎక్కువగా పొడి పిండి చల్లుకుంటూ నెమ్మదిగా వత్తుకోండి.
-తర్వాత వాటిని స్టవ్ మీద వేసి రెండు వైపులా బాగా కాలనివ్వండి. కాలినవైపు ఆయిల్ కొంచెం వేసుకుంటూ బాగా కాల్చుకోండి. అంతే సొరకాయ చపాతీ రెడీ. దీనిని ఎలాంటి సైడ్ డిష్ అక్కర్లేకుండానే కేవలం పెరుగుతోనే కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications