Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఎన్నో పోషకాలున్న మల్టీవిటమిన్ కారం పొడి..రోజుకు ఒక్క ముద్ద దీంతో తింటే ఏ రోగాలు రావు!
మన ఆధునిక జీవనశైలిలో సమయానికి తినడం కూడా కష్టం అయిపోతుంది. ఇక పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఇంకా పెద్ద సవాలు. విటమిన్లు, మినరల్స్ కోసం చాలామంది సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మన వంటింట్లోనే, మన పూర్వీకులు వాడిన పదార్థాలతోనే ఒక అద్భుతమైన పోషకాల గనిని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
అదే మల్టీవిటమిన్ కారం పొడి. ఈ కారం పొడి కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మల్టీవిటమిన్ కారం పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుమ్మడి గింజలు
-పుచ్చ గింజలు
-నువ్వులు
-ధనియాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-ఆయిల్
-కరివేపాకు
-ఉప్పు
-పసుపు
-ఆమ్చూర్ పౌడర్
-వెల్లుల్లి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు(75గ్రా)గుమ్మడి గింజలు వేసి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు పుచ్చ గింజలు వేసి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు నువ్వులు వేసి తక్కువ మంట మీద చిటపటలాడేంతవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు అవిసె గింజలు వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి కాగిన తర్వాత పావు కప్పు కంటె కొంచెం ఎక్కువ(20గ్రా)ధనియాలు వేసి లైట్ గా కలర్ మారేదాకా వేయించాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేశాక ముప్పావు కప్పు(20గ్రా)ఎండుమిరపకాయల ముక్కలు వేసి ఇవి మాడిపోకుండా తక్కువవ మంట మీద కరకరలాడేవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లో శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టిన 1 కప్పు కరివేపాకు వేసి నూనె లేకుండానే కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆపేసి కరివేపాకును ప్లేట్ లోకి తీసుకోవాలి.
-వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందుకోసం ఫస్ట్ వేయించిన ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కరివేపాకు మిక్సీ గిన్నెలో వేసి తగినంత ఉప్పు,పావు టీస్పూన్ పసుపు కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన అవిసె,పుచ్చ,గుమ్మడి గింజలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ఇందులోనే పావు కప్పు(35గ్రా)పొట్టు తీసిన వెల్లల్లి రెబ్బలు వేసి కలిపి ఒకసారి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగానే ఉంటే బాగుంటుంది.
-గ్రైండ్ చేసిన పొడి మొత్తాన్ని ఓ ప్లేట్ లో వేసి పులుపు కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ లేదా ఉసిరికాయ పొడి అయినా వేసి మెత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఈ రెడీ అయిన పొడిని గాజు సీసాలో పెట్టి బయట పెట్టుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
