Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
పిల్లల్లో తెలివితేటలు,పెద్దల్లో నొప్పులు మాయం చేసే లడ్డు..ఇలా చేసుకుంటే స్వీట్ షాపుని మించిన టేస్ట్
డ్రై ఫ్రూట్ లడ్డు.. కేవలం రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు అనేక పోషకాలతో నిండిన అద్భుతం. ఇంట్లోనే టేస్టీగా హెల్తీ స్వీట్ చేయాలనుకుంటే ఈ లడ్డు బెస్ట్ ఆప్షన్. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇవి చక్కెర లేకుండా సహజంగానే తీపిని అందిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ లడ్డూలు..ముఖ్యంగా పండుగల సమయంలో లేదా శక్తిని తక్షణమే పెంచుకోవాల్సినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ లడ్డు రోజుకి ఒకటి తిన్నా పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి,అలాగే పెద్దల్లో నొప్పులు మాయమైపోతాయి. పోషకాల లోపాన్నీ భర్తీ చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని స్వీట్ షాపుకి మించిన రుచితో ఇంట్లోనే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
డ్రై ఫ్రూట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాదంపప్పు
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-గుమ్మడివిత్తనాలు
-పుచ్చకాయ విత్తనాలు
-గసగసాలు
-యాలకల పొడి
-ఖర్జూరం
-పిస్తాపప్పు
-ఎండుకొబ్బరి తురుము
-నెయ్యి

డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం
-ముందుగా ఓ ప్లేట్ లో అరకప్పు బాదంపప్పు(75గ్రా), అర కప్పు జీడిపప్పు, అరకప్పు ఎండుద్రాక్ష, అరకప్పు పిస్తా తీసుకోండి. వీటన్నింటిని చిన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేశాక ఇందులో కట్ చేసిన బాదంముక్కలు వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాక కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ వేయించిన తర్వాత ఇందులోనే కట్ చేసిన పిస్తాపప్పు ముక్కలు,ఎండుద్రాక్ష ముక్కలు,పావుకప్పు గుమ్మడి విత్తనాలు, 50 గ్రాముల పుచ్చ విత్తనాలు వేసి 3 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో అరకప్పు ఎండుకొబ్బరి తురుము వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి 1నిమిషం కలుపుతూ వేయించాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ఇప్పుడు పాన్ లోని మిశ్రమం మొత్తాన్ని ఓ పెద్ద ప్లేట్ లో వేసుకోండి.
-ఇప్పుడు 250 గ్రాముల కర్జూరం పళ్లు తీసుకొని వాటిలోని గింజలు తీసేసి కర్జూరాన్ని మిక్సీ గిన్నెలో వేసి పల్స్ మోడ్ లో తిప్పుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి ఇందులో గ్రైండ్ చేసిన ఖర్జూరపండ్ల పేస్ట్ వేసి తక్కువమంటమీద 2 నిమిషాలు వత్తినట్లు చేస్తూ వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పక్కన ఫ్లేట్ లో ఉంచిన వేయించిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి మెత్తం బాగా కలపాలి. ఇందులోనే అర టీస్పూన్ యాలకల పొడి యాలకల పొడి వేసి కలుపుకోండి.
-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని లడ్డూల్లా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications