Latest Updates
-
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ..ఏంట్రా ఇంత బాగుంది అని మెచ్చుకోవాల్సిందే!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, పెసరట్టు గుర్తొస్తాయి. వీటికి సరైన కాంబినేషన్ అల్లం చట్నీ. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ టిఫిన్ సెంటర్లలో, రొడ్డు సైడ్ టిఫిన్ బండ్ల మీద దొరికే తీపి, కారం, పులుపు కలగలిసిన అల్లం చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. పెసరట్టు, ఇడ్లీ, దోశల్లోకి ఈ అల్లం చట్నీ అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. అల్లం చట్నీ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అల్లం చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-అల్లం
-గుంటూరు ఎండుమిర్చి
-బ్యాడిగె ఎండుమిర్చి
-చింతపండు
-బెల్లం తరుగు
-శనగపప్పు
-మినపపప్పు
-ధనియాలు
-మెంతులు
-జీలకర్ర
-వెల్లుల్లి రెబ్బలు
-ఉప్పు
-నూనె
-పసుపు
-కరివేపాకు
అల్లం చట్నీ తయారీవిధానం
-ముందుగా 25 గ్రాముల అల్లం శుభ్రంగా కడిగి పైన ఉండే పొట్టు తీసేయండి. ఇప్పడు అల్లంని పలుచటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత 20 గ్రాముల చింతపండుని నీళ్లలో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి. అల్లం పచ్చి వాసన పోయి బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి.
-పప్పులు కొంచెం వేగిన తర్వాత అందులో 1అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు వేసి లైట్ గా వేయించాక అందులోనే 10 గుంటూరు ఎండుమిరపకాయలు, 6 బ్యాడిగి చిల్లీ(ఒక రకం ఎండుమిర్చి), 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి. తర్వాత ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి.
-ఇప్పుడు అందులో 50-70గ్రాముల బెల్లం వేసుకోండి. ఒక అరకప్పు నీళ్లు కూడా పోసి నీరు మరిగేంతవరకు బాయిల్ చేసి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో కాచి చల్లార్చిన నీళ్లను కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి 10 రోజులైనా పాడవకుండా ఉంటుంది. అంతే అల్లం పచ్చడి రెడీ. చల్లారిన తర్వాత దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
-తినాలనుకున్నప్పుడు మీరు తినే పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోండి. దీనిని ఇడ్లీ,దోశలతో తింటుంటే వారెవ్వా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications