Latest Updates
-
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే!
డ్రై ఫ్రూట్ బూరెలు: టేస్టీ అండ్ హెల్తీ
బూరెలు అంటే అందరికి ఇష్టమైన వంట. ముఖ్యంగా పండుగల సమయంలో వీటిని తయారుచేయడం ఎక్కువ. శ్రావణం మాసం పడుగల మసాసం కాబట్టి, పండుగల సందర్బంగా వివిధ రకాల వంటలను మీకు పరిచయం చేబడం జరిగింది. వాటితో పాటు మరో వంట మీకోసం డ్రై ఫ్రూట్ బూరెలు.
నోరు ఊరించే పూర్ణం బూరెలు అంటే అందరికి మహా ఇట్టం. పూర్ణం బూరెలకు బదులుగా డ్రైఫ్రూట్స్ తో కాస్త వెరైటీగా తయారుచేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు రుచికి రుచి. డ్రై ఫ్రూట్ బూరెలు తయారుచేయడం చలా సులభం.
కొబ్బరి తురుము, గసగాలు, బెల్లం, కొన్ని డ్రైఫ్రూట్స్ తో చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసుకుంటారు. మరి ఈ ఫెస్టివల్ సీజన్ లో డ్రై ఫ్పుట్ బూరెలు ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1cup
గసగసాలు: 3tbps
బెల్లం తురుము: 2cups
యాలకల పొడి: 1/2tbsp
జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు పొడి (రఫ్ గా చేసుకోవాలి): 1cup
ద్రాక్ష: 1/4cup
మినపప్పు: 1/2glass
బియ్యం: 1cup
నూనె లేదా నెయ్యి: వేగించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందురోజు రాత్రే బియ్యం, మినపప్పు, ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అవి మర్నాటికి మెత్తగా నానుతాయి.
2. వీటిని నీరు వంపేసి, మిక్సీలో వేసి మెత్తగా దోసె పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో బెల్లం తురుము వేసి అది మునిగేలా నీళ్ళు స్టౌమీద పెట్టాలి.
4. బెల్లం కరిగిన తర్వాత అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పొడి, కిస్ మిస్ పలుకులు వేసి బాగా కలపాలి.
5. కొద్దిసేపటికి ఈ మిశ్రమం గట్టిగా అవుతుంది. గట్టిబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
6. ఒక్కో ఉండను చేతిలోకి తీసుకొని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న దోసెపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసేయాలి. ఇలా మిగిలిన ఉండలు కూడా ఇలాగే తయారుచేసుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ బూరెలు రెడీ...



Click it and Unblock the Notifications











