Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మహా శివరాత్రి స్పెషల్ : సక్కర్వల్లి స్వీట్
మహా శివరాత్రి స్పెషల్ : సక్కర్వల్లి స్వీట్
పూర్ణం పోలిల గురించి మీరు వెనే ఉంటారు . పోలీలు ఇండియాలో ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో చాలా ఫేమస్ స్వీట్ రిసిపి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మరియు గుజరాత్, మహరాష్ట్రాలలో వీటిని ట్రెడిషినల్ డిష్ గా వండుకుంటుంటారు .
అయితే సక్కర్వల్లి అంతగా పరిచయం లేని..చాలా మందికి తెలియని స్వీట్ డిష్ . చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది. సక్కర్వల్లి అంటే ఏం లేదు. పూర్ణం పోలీల్లాగానే వీటిని తయారుచేస్తారు. అయితే కొంచెం వెరైటీ స్వీట్ పొటాటో, బెల్లంతో తయారుచేస్తారు. ఈ స్వీట్ డిష్ ను మహాశివరాత్రి పర్వదినాన స్పెషల్ గా తయారుచేసుకోవచ్చు .
ఇలాంటి రిసిపిలను కేవలం పండుగ, శుభకార్యాల్లో మాత్రమే తయారుచేసుకుంటారు . మరి మనం కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా దీన్ని ఎలా తయారుచేయాలి . ఇంట్లో వారికి సమ్ థింగ్ స్పెషల్ గా ఎలా అందించాలో తెలుసుకోవాలంటే....రిసిపి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే...మరికెందుకు ఆలస్యం ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
స్టఫ్ చేయడానికి కావల్సినవి
బెల్లం: 1 cup
యాలకలపొడి: 1 teaspoon
స్వీట్ పొటాటోలు: 5
ఉప్పు: చిటికెడు
పోలి తయారుచేయడానికి కావల్సినవి:
నూనె: 1 tablespoon
మైదా: 1 cup maida
నెయ్యి: కొద్దిగా
నీళ్ళు: పిండికలుపుకోవడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, నెయ్యి, ఉప్పు , కొద్దిగా బియ్యం పిండి మరియు రవ్వ వేయాలి . మొత్తం మిశ్రమాన్ని చేత్తో కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి .
2. ఇలా కలిపుకొన్న పిండిని ఒక గంట వరకూ అలాగే ఉండనివ్వాలి.
3. అంతలోపు ప్రెజర్ కుక్కర్లో స్వీట్ పొటాటో వేసి బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా ఉడికించకుండా మీడియంగా ఉడికించుకోవాలి.
4. ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి, తొక్కను తొలగించాలి . ఇప్పుడు వాటిని ముక్కలుగా చేసి మెత్గగా మ్యాష్ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద గిన్నెలో కిద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లం వేసి కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి . ఇప్పుడు ఈ చిక్కగా ఉండే బెల్లం నీటితో పొటాటో మిశ్రమంతో కలిపి 5-10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు యాలకలపొడి కూడా తీసుకొని పొటాటో మిశ్రమంలో వేసి మిక్స్ చేసి, పక్కనుంచుకొని చల్లారనివ్వాలి.
7. తర్వాత మైదాపిండి ముద్దలో నుండి కొద్దిగా నిమ్మకాయంత తీసుకొని ఫ్లాట్ గా చేసి అందులో స్వీట్ పొటాటో మిశ్రమం కొద్దిగా తీసుకొని మైదా చపాతీలో మద్యలో ఉండచేసి పెట్టాలి.
8. ఇలా కొన్ని తయారుచేసి పెట్టుకొన్నాక, చిన్న సైజు పూర్ణం పోలిలను తయారుచేసుకోవాలి. ఇలా అన్ని పోలిల్లా రుద్ది పెట్టుకొన్నాక. పాన్ స్టౌ మీద పెట్టి నెయ్యి లేదా నూనెతో రెండువైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే సక్కరవల్లి స్వీట్ రెడీ. వేడి వేడిగా కొద్దిగా నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటాయి .



Click it and Unblock the Notifications











