Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి
ఉరుకుల పరుగుల జీవితంలో, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పడిపోయి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. రోజూ మనం తినే జంక్ ఫుడ్ వల్ల మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయువాలు క్రమంగా తమ శక్తిని కోల్పోయి మూలనపడుతున్నాయి. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, దెబ్బతిన్న మన అంతర్గత అవయవాలను శుభ్రం చేసి, వాటికి మళ్లీ ప్రాణం పోసే ఓ అద్భుతమైన మొక్క గలిజేరు. ఆయుర్వేదంలో దీనిని పునర్నవ(నవ యవ్వనాన్ని ఇచ్చేది) అని పిలుస్తారు.

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. శరీరంలోని మలినాలను బయటకు పంపి కిడ్నీలను అద్దంలా శుభ్రం చేస్తుంది. ఆల్కహాల్, జంక్ ఫుడ్ వల్ల దెబ్బతిన్న కాలేయానికి ఇది రక్షక కవచంలా పనిచేసి, లివర్ పనితీరును వందశాతం మెరుగుపరుస్తుంది. బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ ఆకుకూరను తింటే దృష్టి లోపాలు తొలగిపోయి, కంటి చూపు తేజస్సుగా మారుతుంది
గలిజేరు మొక్క పల్లెటూళ్లలో పొలాల గట్ల మీద, బీడు భూముల్లో విరివిగా పెరుగుతుంది. గలిజేరు ఆకును నేరుగా తినడం కంటే, కందిపప్పుతో కలిపి వండుకుంటే అద్భుతమైన రుచితో పాటు పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.

గలిజేరు ఆకు పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు - 1 కప్పు
గలిజేరు ఆకు - 2 కట్టలు
ఉల్లిపాయ- తగినన్ని
పచ్చిమిర్చి - తగినన్ని
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రుచికి సరిపడా
పసుపు- రుచికి సరిపడా
చింతపండు - రుచికి సరిపడా
ఆవాలు-కొద్దిగా
జీలకర్ర-కొద్దిగా
మినప్పప్పు-కొద్దిగా
ఎండుమిర్చి-తగినన్ని
వెల్లుల్లి-తగినన్ని
కరివేపాకు-తగినంత
ఇంగువ-కొద్దిగా
గలిజేరు ఆకు పప్పు తయారీ విధానం
-ముందుగా కందిపప్పును కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
-గలిజేరు ఆకులను కాడల నుంచి వేరుచేసి, ఆకులకు మట్టి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు కుక్కర్ లో నానబెట్టిన పప్పు, గలిజేరు ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
-పప్పు ఉడికిన తర్వాత, కొద్దిగా చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.
-ఇప్పుడు ఓ పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి.
-రెడీ అయిన తాలింపుని పప్పులో కలుపుకోవాలి. అంతే ఘుమఘుమలాడే ఆరోగ్యకరమైన, కమ్మని గలిజేరు పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
