Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
తంజావూర్ స్పెషల్ తవలవడ..పప్పుల మిశ్రమంతో కరకరలాడే అద్భుతమైన స్నాక్..ఎలా చేసుకోవాలంటే..
తమిళనాడులోని తంజావూర్ వంటకాలకు దక్షిణ భారత ఆహార చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి సాంప్రదాయ వంటకాలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందులో అత్యంత ప్రసిద్ధమైనది, సాయంత్రం వేళ స్నాక్ గానూ లేదా పండుగ రోజుల్లో అల్పాహారంగానూ తీసుకునే తవల వడ సాధారణ మినప వడ లేదా మసాలా వడ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది.
తవల వడ ప్రత్యేకత ఏమిటంటే ఇది బయట చాలా క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటుంది. తంజావూర్ స్పెషల్ తవల వడ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చి శెనగపప్పు
-కందిపప్పు
-మినపప్పు
-పెసరపప్పు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-అల్లం
-కరివేపాకు
-ఇంగువ
-ఆవాలు
-పచ్చికొబ్బరి తురుము
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అర కప్పు బియ్యం,అర కప్పు పచ్చి శెనగపప్పు, అర కప్పు మినపప్పు, అర కప్పు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులోనే నీళ్లు పోసి 3-4 గంటల పాటు నాననివ్వాలి.
-ఇదే సమయంలో మరో గిన్నెలో పావు కప్పు పెసరపప్పుని సపరేట్ గా నీళ్లు పోసి 3-4 గంటల పాటు నానబెట్టుకోండి.
-4 గంటల తర్వాత నానబెట్టిన పప్పు మిశ్రమాన్ని నీళ్లు వంపేసి మళ్లీ ఒకసారి కడిగి జాలి గిన్నెలోకి పప్పుల మిశ్రమాన్ని వేయండి.
-తర్వాత నానబెట్టిన పెసరపప్పుని కూడా జాలి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 3 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం, 4 ఎండు మిరపకాయలను తుంపి వేసి నీళ్లు పోయకుండా ఈ మొత్తాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే నానబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మిశ్రమాన్ని ఒకేసారి కాకుండా రెండు సార్లుగా వేసి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా చేత్తో వత్తితే లైట్ గా ఒరకగా ఉండాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమం మీద పోసేయాలి. ఇందులోనే అర టీస్పూన్ ఇంగువ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మొత్తం కలిసేలా చేత్తో కలుపుకొని మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
-అరగంట తర్వాత చేతిని నీటితో తీసుకోని పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా వత్తుకోవాలి.
-స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో వత్తుకున్న వడలను ఒక్కొక్కటిగా వేయాలి. మీడియం మంట మీద రెండువైపులా ఎర్రగా కాలిన తర్వాత బయటకు తీసేయాలి. అంతే తవల వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications