Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
వెన్నపూసలా నోట్లో కరిగిపోయే కమ్మని కట్టె పొంగలి..ఎలా చేసుకోవాలో చూడండి
సౌతిండియలో ముఖ్యంగా ఏపీ,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన సంప్రదాయ వంటకం కట్టె పొంగలి. దీనిని పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ గా లేదా పండుగలలో దేవుడికి నైవేద్యంగా తయారు చేస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, చాలా ఆరోగ్యకరమైనది కూడా. అతి మధురంగా,మృదువుగా, వెన్నపూసలా నోట్లో కరిగిపోయే కమ్మని కట్టె పొంగలి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెసరపప్పు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-నెయ్యి
-నూనె
-మిరియాలు
-జీలకర్ర
-అల్లం
-జీడిపప్పు
-కరివేపాకు
-ఇంగువ

తయారీ విధానం
-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1కప్పు పెసరపప్పు(180గ్రా)వేసి తక్కువ మంట మీద బాగా వేయించండి. కొంచెం కలర్ మారుతుంది అన్న టైంలో స్టవ్ ఆపేయండి.
-తర్వాత ఒక కుక్కర్ లో 1కప్పు బియ్యం(180గ్రా),వేయించిన పెసరపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక అందులో 3 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, వేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూతపెట్టేసి పెద్ద మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-ఇదే సమయంలో ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యండి.
-కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ లోని గాలి అంతా పోయిన తర్వాత మూత తీసి ఉడికిన పెసరపప్పు అన్నంని గరిటతో ఒకసారి కలిపి ఇందులో వేడి చేసిన 3 కప్పుల నీళ్లు పోసి కలిపి 2 నిమిషాలు స్టవ్ మీద ఉడికించాక కుక్కర్ ని పక్కన పెట్టుకోండి.
-తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె, అరకప్పు నెయ్యి(90గ్రా)వేసి వేడి చేశాక ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తరుగు, ఒకటిన్నర టీస్పూన్ మిరియాలు వేసి దోరగా ఫ్రై చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఇవి లైట్ గా కలర్ మారాక ఇందులోనే సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆపేయండి.
-రెడీ అయిన తాలింపుని పక్కన ఉంచిన కుక్కర్ లో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కమ్మని,రుచికరమైన కట్టె పొంగలి రెడీ.
-పొంగలిలో ఫైబర్, ప్రోటీన్ ఉండటం వలన ఇది త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీని వలన అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు, తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications