Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కూరలో ఉప్పు ఎక్కువైందా.? పెరుగు పుల్లగా అయిందా.. అయితే ఇలా సరిచేయండి.!
వంట చేసేటప్పుడు ఒక్కోసారి కూరలో ఉప్పు ఎక్కువ అవడం సర్వసాధారణం. దీంతో అంత కష్టపడి ఇష్టంగా చేసిన వంట ఎవరూ కడుపు నిండా తినలేకపోయారే అనే బాధ కలుగుతుంది. ఇక, అప్పుడప్పుడూ పెరుగు పుల్లగా కూడా అవుతుంటుంది. పెరుగు తియ్యగా లేదా చప్పగా ఉంటేనే తినగలరు. కొంచెం పులుపైనా అయిష్టంగానే భోజనం ముగించేస్తారు. అయితే ఇకపై ఇలాంటి సమస్య వస్తే చింతించకండి. ఈ చిన్న ట్రిక్స్ ద్వారా వాటిని రుచికరంగా మార్చుకోవచ్చు.

ఈసారి కూరలో ఉప్పు ఎక్కువైనా, పెరుగు పుల్లగా అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. వంటింటి సాధారణ చిట్కాలతోనే కూరలో ఉప్పు సరిచేసుకోవచ్చు. పెరుగును టేస్టీగా లాగించేయొచ్చు.
కూరలో ఉప్పును ఇలా తగ్గించేయండి
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు స్టవ్‌పైన ఉండగానే.. పచ్చి బంగాళాదుంప ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసి కూరలో వేయాలి. ఇలా చేయడం ద్వారా కూరలోని అదనపు ఉప్పుని పీల్చుకుని సరిచేస్తుంది. తర్వాత ఆ ముక్కలను తీసేయవచ్చు.
ఆ సమయంలో బంగాళాదుంపలు మీ వంటగదిలో లేకపోతే గోధము పిండితో ఉప్పును సరిచేయవచ్చు. కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసేస్తే ఉప్పు తగ్గిపోతుంది. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, పాల మీగడ లేదంటే పెరుగు కలిపినా ఎక్స్ట్రా ఉప్పును తగ్గించుకోవచ్చు.
గ్రేవీ ఎక్కువగా ఉన్న కూరల్లో ఉప్పు ఎక్కువైనట్లయితే కొన్ని ఉల్లిపాయలు లేదంటే టమాటాలను వేయించాలి. తర్వాత వాటిని పేస్ట్ చేసి కూరలో కలిపి కాసేపు మరిగించాలి. కొబ్బరి పాలు లేదంటే ఎండు కొబ్బరి పొడిని కూరలో కలిపి కాసేపు ఉడికించినా ఉప్పు తగ్గి రుచికరంగా మారుతుంది.
టేస్టీ పెరుగు కోసం
ఎప్పుడైనా పాలల్లో పెరుగు తోడు ఎక్కువైనా, పెరుగు తోడుకున్నాక ఎక్కువసేపు బయటే ఉంచినా పుల్లగా మారుతుంది. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి పెరుగులో పులుపును తగ్గించుకోవచ్చు.

పెరుగు బాగా పులిసినట్లయితే అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కలపాలి. కాసేపు పక్కన పెట్టినట్లయితే పులుపు తగ్గిపోతుంది. మరో చిట్కా పుల్లటి పెరుగులో నీళ్లు పోసి బాగా కలిపి ఒక పల్చటి శుభ్రమైన కాటన్ గుడ్డలో వేసి వడకట్టాలి. తర్వాత గట్టిగా క్లాత్‌ను పిండాలి. ఇప్పుడు నీళ్లు పోయాక ఆ చిక్కటి పెరుగులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కలుపుకోవచ్చు.
పెరుగు పుల్లగా అయినట్లయితే అందులో నీళ్లు, కొంచెం ఉప్పు, కట్ చేసిన అల్లం ముక్కలు, కొత్తిమీర కలపాలి. దీన్ని మజ్జిగలా చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. లేదంటే ఆ మజ్జిగను తాలింపు పెట్టుకుని మజ్జిగ చారులా చేసుకుంటే రుచి అదిరిపోతుంది. పుల్లటి పెరుగు ఎక్కువగా ఉన్నట్లయితే మరో రోజు తినొచ్చు అనుకుంటే అందులో కొన్ని ఐస్ ముక్కలు వేసుకున్నట్లయితే పెరుగు ఇంకా ఎక్కువ పులియకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
