Latest Updates
-
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు..
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే!
సొరకాయ పేరు చెబితే చాలు చాలామంది ముఖ్యంగా పిల్లలు కూడా ఆమడ దూరం పరుగెడతారు. కానీ సొరకాయలో ఉండే విటమిన్లు, ఫైబర్, నీటి శాతం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి పిల్లలు సొరకాయను ఇష్టంగా తినాలంటే ఏం చేయాలి? ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారమే ఈ నోరూరించే సొరకాయ ఊతప్పం. ఇది చేయడం చాలా సులువు, లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈజీగా సొరకాయ ఊతప్పం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

సొరకాయ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా
బంగాళదుంప - 1
బియ్యం - 1 కప్పు
అల్లం ముక్క - 1 అంగుళం
మిరియాల పొడి - 1 టీస్పూన్
తాజా కొత్తిమీర - గుప్పెడు
బేకింగ్ సోడా - అర టీస్పూన్
నెయ్యి - ఊతప్పం కాల్చుకోవడానికి
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 8 ఆకులు
రెడ్ చిల్లీ ఫ్లేక్స్- 1 టీస్పూన్
సొరకాయ ఊతప్పం తయారీ విధానం
-ముందుగా గంటపాటు బియ్యం నానబెట్టుకోవాలి.
-గంట తర్వాత నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వడకట్టండి. ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, ఉడికించిన బంగాళదుంప, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. సొరకాయలో సహజంగానే నీరు ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు అదనంగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు.
-గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో తాలింపు కోసం నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరిగిన కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి చిటపటలాడనివ్వండి. ఈ కమ్మని తాలింపును రెడీగా ఉంచుకున్న పిండిలో వేసి కలపండి.
-మీరు ఊతప్పం వేయడానికి సరిగ్గా ముందు, పిండిలో బేకింగ్ సోడా లేదా ఫ్రూట్ సాల్ట్ వేసి ఒకసారి సున్నితంగా కలపండి. దీనివల్ల ఊతప్పం సాఫ్ట్ గా వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనం పెట్టి కొద్దిగా నెయ్యి రాయండి. పెనం వేడెక్కాక రెండు గరిటెల పిండిని తీసుకుని కాస్త మందంగా (ఊతప్పంలా) వేయండి. మూత పెట్టి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించండి. తర్వాత నెమ్మదిగా తిరగేసి, చుట్టూ కొద్దిగా నెయ్యి వేసి రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన సొరకాయ ఊతప్పం రెడీ. నెయ్యి వేసి కాల్చడం వల్ల వచ్చే సువాసన పిల్లలను ఇట్టే ఆకర్షిస్తుంది. నువ్వులు, తాలింపు వల్ల దీనికి అద్భుతమైన రుచి వస్తుంది. ఈ ఊతప్పం పైన క్రిస్పీగా, లోపల చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ లో చల్లారాక కూడా రుచి ఏమాత్రం తగ్గదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications