Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
బీట్ రూట్ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి ఆహా అనిపించే రుచి
సాధారణంగా మన ఇళ్లలో బీట్ రూట్ చూస్తేనే ముఖం చాటేసే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు దీని రుచి అంతగా నచ్చదు. బీట్ రూట్ తో సాధారణంగా చేసే ఫ్రైలు, కూరలు బోర్ కొట్టేస్తుంటాయి. కానీ బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే.
బీట్ రూట్ తో పచ్చడి చేస్తే అద్బుతంగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు ఒక్కసారి రుచి చూస్తే, బీట్రూట్ అంటే ఇష్టం లేని వారు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. నోరూరించే బీట్ రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బీట్ రూట్: 1
గట్టి పెరుగు: 1 కప్పు
నీరు: పావు కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి: 2 పెద్ద ముక్కలు
పచ్చిమిర్చి: 3
అల్లం: ఒక చిన్న ముక్క
జీలకర్ర: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
కొబ్బరి నూనె: 2 టీస్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
ఎండు మిరపకాయలు: 2
కరివేపాకు: 1 రెబ్బ
తయారీ విధానం
-ముందుగా బీట్ రూట్ తొక్క తీసి, సన్నగా తురుముకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో తురిమిన బీట్ రూట్ వేయాలి. దీనికి పావు కప్పు నీరు, చిటికెడు ఉప్పు జత చేసి మూత పెట్టి 5- 8 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. బీట్ రూట్ మెత్తబడే వరకు ఉడికితే సరిపోతుంది.
-బీట్ రూట్ ఉడికే లోపు మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఇందులో చాలా తక్కువ నీరు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమం పచ్చడికి మంచి రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది.
-ఇప్పుడు ఉడుకుతున్న బీట్ రూట్ లో సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు మరొక 2-3 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. నీరు మొత్తం ఆవిరైపోయి మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-బీట్ రూట్ మిశ్రమం గోరువెచ్చగా లేదా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు కలపాలి. ఒక కప్పు గట్టి పెరుగును వేసి, రుచికి సరిపడా ఉప్పు చూసుకుని బాగా కలపాలి. ఇప్పుడు పచ్చడి మంచి గులాబీ రంగులోకి మారుతుంది.
-చివరగా తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొబ్బరి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసి కలిపితే ఆహా అనిపించే బీట్ రూట్ పచ్చడి రెడీ.
-దీనిని వేడి అన్నంతో పాటు, చపాతీల్లోకి కూడా సైడ్ డిష్‌గా తినవచ్చు. పిల్లలకు రంగురంగుల ఆహారం అంటే ఇష్టం కాబట్టి ఈ పింక్ కలర్ పచ్చడిని వారు చాలా ఇష్టంగా తింటారు. రక్తహీనత ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం లాంటిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications