Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ దొండకాయ పచ్చడి రుచి చూస్తే జన్మలో వదలరు..ఎలా చేసుకోవాలంటే
దొండకాయ పచ్చడి అనేది ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, మసాలాలతో కూడిన వంటకం. దొండకాయ ముక్కలతో పాటు కొన్ని టమాటో ముక్కలను కూడా వేయించి రుబ్బుతారు. టమాటో వాడకం వలన పచ్చడికి అదనపు పులుపు, కాస్త తియ్యదనం వస్తుంది. అన్నంతో పాటు నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి కేవలం అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోస, వడ, ఉప్మా,చపాతీ, పుల్కా, పరాఠాలో కూడా బాగుంటుంది. దొండకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
దొండకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-దొండకాయలు
-ఉల్లిపాయ
-టమాటో
-పచ్చిమర్చి
-చింతపండు
-జీలకర్ర
-ధనియాలు
-వెల్లుల్లి
-కొత్తిమీర
-పల్లీలు
-ఆయిల్
-ఉప్పు

దొండకాయ పచ్చడి తయారీ విధానం
-దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లు కత్తిరించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత ప్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు(పల్లీలు)వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 15 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసి సన్నని సెగ మీద వేయించి పక్కకు తీసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు వేసి లైట్ గా వేగాక అందులో పావుకేజీ దొండకాయ ముక్కలు, 3 టమాటోకాయల పెద్ద ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించుకోవాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.
-15 నిమిషాలకు దొండకాయ మగ్గిపోతుంది,టమాటో మెత్తబడుతుంది..ఈ దశలో స్టవ్ ఆఫ్ చేసేయండి.
-తర్వాత మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్నాక అందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు,వేయించిన పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా గ్రైండ్ చేశాక ఇందులోనే మగ్గించిన టమాటోలు,దొండకాయ ముక్కలు కూడా వేసి రోట్లో దంచినట్లుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా కాడలతో పహా వేసి పల్స్ మోడ్ లో 2-3 పల్సులు ఇస్తే దొండకాయ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
