Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వడ పావ్ రుచి రహస్యం ఇదే..ముంబై స్ట్రీట్ స్టైల్ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ
వడ పావ్.. ఈ పేరు వినగానే ముంబై వీధులు గుర్తుకొస్తాయి. ముంబై స్ట్రీట్ ఫుడ్ లో రారాజుగా వెలుగొందుతున్న వడ పావ్ రుచి అంత అద్భుతంగా ఉండటానికి అసలు కారణం ఏంటో తెలుసా? వడ పావ్ మధ్యలో రాసే ఆ ఘాటైన ఎర్రటి పొడి కారం.
చాలామంది వడ పావ్ ఇంట్లో చేస్తారు కానీ, బండి మీద దొరికే ఆ ప్రత్యేకమైన చట్నీ రుచి రాక నిరాశ పడుతుంటారు. ఆ చట్నీ లేకపోతే వడ పావ్ అసంపూర్ణమే. సమోసా, పకోడీ, బజ్జీలు, చివరకు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా సరే ఈ చట్నీ రుచి అమృతంలా ఉంటుంది. హోటల్ రుచిని మించేలా, ఘుమఘుమలాడే ముంబై స్టైల్ డ్రై గార్లిక్ చట్నీని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూడండి.

కావలసిన పదార్థాలు
వెల్లుల్లి: 10- 12 రెబ్బలు
ఎండు మిరపకాయలు: 8-10
వేయించిన శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఇంగువ: 1 చిటికెడు
నూనె: 1 నుండి 2 టేబుల్ స్పూన్లు
చింతపండు పేస్ట్: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.
-నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను వేయండి. మంటను తక్కువలో ఉంచి వెల్లుల్లి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
-వెల్లుల్లి వేగిన తర్వాత అందులో పుట్నాల పప్పు వేయండి. మరో 1-2 నిమిషాలు దోరగా వేయించండి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేయండి. చట్నీకి ఆకర్షణీయమైన పుల్లని రుచి కావాలనుకుంటే, ఈ దశలోనే ఒక చిన్న చెంచా చింతపండు పేస్ట్ లేదా ఎండబెట్టిన చింతపండు తునకను కలపండి. స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టండి.
-వేయించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ముద్దగా అయిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని బరకగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తని పేస్ట్‌లా చేయకూడదు.
-తయారైన ఈ ఘాటైన చట్నీని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోండి. ఇది 2-3 వారాల పాటు పాడవకుండా, తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
-ఇప్పుడు వేడి వేడి వడ పావ్ మధ్యలో ఈ పొడిని దట్టించి, ఒక పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
-కేవలం వడ పావ్ మాత్రమే కాదు, శాండ్ విచ్, దోశ, ఇడ్లీ, లేదా సాయంత్రం చేసుకునే ఏ స్నాక్ లోకైనా ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
