Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బంగారు వర్ణంలో, పల్చగా, క్రిస్పీగా.. రెస్టారెంట్ స్టైల్ పర్ఫెక్ట్ పేపర్ దోశ ఇంట్లోనే ఈజీగా..
సౌతిండియా వంటకాల ప్రస్తావన వస్తే మనసులో మెదిలే మొదటి పేర్లలో పేపర్ దోశ ఒకటి. పెనం మీద నుండి ప్లేట్‌లోకి రాగానే వినిపించే ఆ కరకరలాడే శబ్దం, చూడగానే కట్టిపడేసే బంగారు వర్ణం, నోట్లో వేసుకోగానే కరిగిపోయే దాని రుచి.. ఆహా, ఆ అనుభూతే వేరే లెవల్లో ఉంటుది.
చాలామంది ఈ అద్భుతమైన పేపర్ దోశను కేవలం హోటళ్లలో మాత్రమే ఆస్వాదించగలమని అనుకుంటారు. కానీ కొన్ని చిన్నపాటి మెలకువలు పాటిస్తే, అదే హోటల్ రుచిని, రూపాన్ని మన వంటింట్లోనే సృష్టించవచ్చు. మన నాలుకకు విందు చేయడమే కాదు మన శరీరానికి ఎంతో మేలు చేసే పేపర్ దోశను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
పొట్టు లేని మినపప్పు- అర కప్పు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - దోశలు కాల్చడానికి
నీరు - అవసరమైన మేరకు
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మంచి నీళ్లు పోసి కనీసం 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
-తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని నీటిని వంపేసి మిక్సీ గిన్నెలో లేదా గ్రైండర్ లో వేయాలి. అవసరమైనంత నీటిని కొద్దికొద్దిగా చేర్చుకుంటూ వెన్నలా నునుపైన, మృదువైన పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
-రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి, వెచ్చని ప్రదేశంలో 8 గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి, సిద్ధంగా ఉంటుంది.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పేపర్ దోశకు పిండి పల్చగా ఉండాలి. కాబట్టి, కొద్దిగా నీళ్లు పోసి సాధారణ దోశ పిండి కంటే కొంచెం జారుడుగా ఉండేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలి. మొదటి దోశ వేసే ముందు, కొన్ని చుక్కల నూనె వేసి, ఒక ఉల్లిపాయ ముక్కతో పెనం అంతా రుద్దండి. ఇది దోశ అంటుకోకుండా రావడానికి సహాయపడుతుంది.
-ఒక గరిటెడు పిండిని తీసుకుని వేడిగా ఉన్న పెనం మధ్యలో వేసి, గరిటె అడుగు భాగంతో వృత్తాకారంలో, వీలైనంత పల్చగా, పెద్దగా రుద్దాలి.
-దోశ చుట్టూ, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. మంటను మీడియంలో పెట్టి, దోశ అంచులు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేవరకు కాల్చాలి.
-దోశ పూర్తిగా కాలిన తర్వాత దానిని మెల్లగా ఒక వైపు నుండి రోల్ చేసి, ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే పేపర్ దోశ రెడీ.
-ప్రతి దోశ వేసిన తర్వాత పెనం మరీ వేడిగా అనిపిస్తే, కొన్ని నీళ్లు చిలకరించి ఒక శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇది పెనం ఉష్ణోగ్రతను నియంత్రించి, తర్వాతి దోశ కూడా అంతే పర్ఫెక్ట్ గా, కరకరలాడుతూ రావడానికి సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications