Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఈ గంజి తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మారిన ఆహార అలవాట్లు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో బరువు పెరగడం అనేది చాలామందికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. కొంతమంది అయితే బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు..అయినా బరువు తగ్గరు. దీనికి చాలానే కారణాలుంటాయి. అయితే ప్రకృతి ప్రసాదించిన ఓ అద్భుతమైన ఆహారం మీకోసం ఉంది. అదే వెదురు బియ్యం గంజి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ గంజిని రోజూ తీసుకోవడం ద్వారా మీరు వేగంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.
వెదురు బియ్యం..చూడటానికి సాధారణ బియ్యంలా కనిపించినా, పోషకాల విషయంలో ఇది ఒక గని. వెదురు చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారే పూసి, ఈ అరుదైన బియ్యాన్ని అందిస్తుంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది షుగర్ పేషెంట్లకు ఒక వరంలాంటిది. కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచి, అనవసరమైన తిండిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, కొవ్వును కరిగించడంలో సహాయపడే వెదురు బియ్యం గంజి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వెదురు బియ్యం గంజి తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెదురు బియ్యం - 1 కప్పు
-నీరు - 7 కప్పులు
-నూనె - 1 టేబుల్ స్పూన్
-జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
-ఉల్లిపాయ - 1
-క్యారెట్ - 1
-బీన్స్ - 5
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-పచ్చిమిర్చి - 1
-కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
-కొబ్బరి తురుము - అర కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా వెదురు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి.
-నానిన బియ్యాన్ని నీళ్లు వంపేసి మిక్సీ జార్ లో వేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్ లో వేసి 5 కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడిచేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
-ఆ తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు కప్పుల నీళ్లు పోసి కూరగాయలు మెత్తబడే వరకు 5 నిమిషాల పాటు ఉడికించాలి.
-కూరగాయలు ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వెదురు బియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
-చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి మరోసారి కలిపితే వేడివేడి, పోషకాలతో నిండిన వెదురు బియ్యం గంజి రెడీ. దీనిని వేడిగా లేదా చల్లగా కూడా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications