Latest Updates
-
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్!
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
తెలుగు ప్రజల పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానం ఉంది. యుగ + ఆది = ఉగాది అనగా సృష్టి ప్రారంభమైన రోజు అని అర్థం. వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. చెట్లు చిగురించి, పూలు పూసి పకృతి అంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ పండుగ రోజున ప్రతి తెలుగు లోగిలిలో తప్పనిసరిగా కనిపించే, రుచి చూసే మొట్టమొదటి పదార్థం ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడి కేవలం ఒక వంటకం కాదు, అది ఒక ఔషధం, జీవిత సత్యాలను బోధించే ఒక అద్భుతమైన ప్రతీక. ఆరు భిన్నమైన రుచుల సమ్మేళనంతో తయారయ్యే ఈ పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అని పిలుస్తారు. ఈ ఆరు రుచులు మానవ జీవితంలో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు, భావోద్వేగాలకు ప్రతీకలు. ఈ ఏడాది మార్చి 19న ఉగాది జరుపుకుంటున్నారు. సంప్రదాయ తెలుగు నూతన సంవత్సర వంటకం ఉగాది పచ్చడి మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
లేత మామిడికాయ ముక్కలు- అర కప్పు
వేపపువ్వు - 2 టేబుల్ స్పూన్లు
కొత్త చింతపండు -నిమ్మకాయ సైజులో
పాత బెల్లం తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - 1 లేదా మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - చిటికెడు
నీళ్లు - ఒకటి లేదా రెండు కప్పులు
ఉగాది పచ్చడి తయారీ విధానం
-ముందుగా చింతపండును ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి.
-నానిన తర్వాత చింత నుండి చిక్కటి రసం (గుజ్జు) తీసి, పిప్పిని పక్కన పారేయాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇందులోనే బెల్లం తురుమును వేసి, బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి.
-వేప చెట్టు నుండి తాజాగా కోసిన పూలను తీసుకుని, కాడలు లేకుండా కేవలం పువ్వులను (రేకులను) మాత్రమే వేరు చేయాలి.
-ఇప్పుడు చింతపండు, బెల్లం మిశ్రమంలో సన్నగా తరిగిన లేత మామిడికాయ ముక్కలు, శుభ్రం చేసుకున్న వేపపువ్వు, పచ్చిమిర్చి ముక్కలు లేదా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
-మిశ్రమం మరీ చిక్కగా ఉంటే, తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. ఉగాది పచ్చడి కొంచెం పల్చగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది. మీకు ఇష్టమైతే అరటిపండు ముక్కలు, పుట్నాలు వేసి కలుపుకోవచ్చు.
-అంతే ఎంతో పవిత్రమైన, ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి రెడీ. దీనిని ముందుగా ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఖాళీ కడుపుతో (పరగడుపున) స్వీకరించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












