Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
ఎగ్ బుర్జీ ఇలా చేస్తే..చికెన్, మటన్ కర్రీలు కూడా పనికిరావు..10 చపాతీలైనా లొట్టలేసుకుంటూ తింటారు!
భారతీయ వంటకాల్లో ఎగ్ బుర్జీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోగలిగే వంటకం. ఇది చపాతీ, రోటీ, బ్రెడ్ లేదా అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఎగ్ బుర్జీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొందరు పొడిపొడిగా ఇష్టపడితే, మరికొందరు కాస్త గ్రేవీలా ఉండాలని కోరుకుంటారు. అయితే మీరు ఇది వరకు ఎప్పుడూ ఎక్కడా టేస్ట్ చేయని, సరికొత్త స్టైల్ లో ఎగ్ బుర్జీ మసాలా కర్రీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటోలు
-ఉల్లిపాయలు
-జీడిపప్పు
-ఉప్పు
-పసుపు
-కారం
-మిరియాల పొడి
-గుడ్లు
-లవంగాలు
-పచ్చిమిర్చి
-ఆయిల్
-దాల్చిన చెక్క
-బిర్యానీ పువ్వు
-బిర్యానీ ఆకు
-యాలకలు
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-కసూరి మేథీ
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో 2 టమాటోల ముక్కలు, 10 జీడిపప్పు ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్లు పగులకొట్టి తీసుకోండి. ఇందులో అర టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ మిరియాల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్లు స్పూన్ తో కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేయాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి బాగా కాల్చుకోవాలి.
-ఒక నిమిషం తర్వాత మనం పొరటు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే ముక్కలు ముక్కలుగా వచ్చేటట్లు గరిటతో పాన్ లోని ఎగ్ మిశ్రమాన్ని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రంగు మారేంతవరకు వేయించుకొని పాన్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, బిర్యానీ పువ్వు, యాలకలు(అన్నీ కొద్ది కొద్దిగా)వేసి వేయించాక ఇందులోనే 3 పచ్చిమిరపకాయల చీలికలు, 3 మిడియం సైజ్ ఉల్లిపాయల సన్నని తరుగు వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన టమాటో జీడిపప్పు పేస్ట్ ను పాన్ లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తక్కువ మంట మీద టమాటో పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు వేయించుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారం, అర టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి తక్కువ మంట మీద మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకొని మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. 2-3 నిమిషాలు ఉడికి కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, 1 టీస్పూన్ కసూరి మేథీ, అర టీస్పూన్ గరం మసాలా పొడి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొరటును కూడా వేసి బాగా కలుపుకొని తక్కువ మంట మీద మరో 2 నిమిషాలు ఉడికించాలి.
-ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీలా వచ్చేంతవరకు ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర తరుగు కొంచెం చల్లుకొని కలిపి స్టవ్ ఆపేయండి. అంతే ఎగ్ బుర్జీ కర్రీ రెడీ. దీనిని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఒట్టి కర్రీనే తినేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








