Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
భారతీయుల భోజనంలో బంగాళదుంపలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ వేడి వేడి అన్నం తిన్నాక, చివర్లో కమ్మటి పెరుగన్నం తింటున్నప్పుడు నంజుకోవడానికి కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే ఆ రుచే వేరు. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా కడుపు నిండా తృప్తిగా తినేస్తాం. కేవలం పెరుగన్నంలోకే కాదు పప్పు, రసం, సాంబార్ లాంటి ఏ వంటకంలోకైనా ఇది అదిరిపోయే సైడ్ డిష్.

సాధారణంగా చేసే ఆలుగడ్డ వేపుడు కంటే విభిన్నంగా, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వాడి చేసే ఈ వెరైటీ రెసిపీ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా సులువుగా, తక్కువ సమయంలో ఈ అద్భుతమైన ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
బంగాళదుంప ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు- 3
ఉల్లిపాయ - 1
నూనె - 10 మి.లీ
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 3
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు -అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్- 1 టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
కొత్తిమీర - ఒక చిన్న కట్ట
బంగాళదుంప ఫ్రై తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, సమానమైన గుండ్రటి ముక్కలుగా కోసుకోవాలి.
-కోసుకున్న బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలో నీళ్లు పోసి సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల దుంపల్లోని స్టార్చ్ పోయి, ముక్కలు వేయించేటప్పుడు అంటుకోకుండా కరకరలాడుతూ వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తాలింపు వేగగానే, ముందుగా నీళ్లలో నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను నీళ్లు లేకుండా తీసి పాన్ లో వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు వాటిపై చేతితో కొద్దిగా నీళ్లు చల్లి, మూతపెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల ముక్కలు లోపల మెత్తగా ఉడుకుతాయి.
-బంగాళదుంపలు కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్ వేసి ముక్కలన్నింటికీ మసాలాలు బాగా పట్టేలా పైకి కిందకి ఎగరేస్తూ కలపండి.
-మసాలాలు ముక్కలకు పట్టిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయండి. మళ్లీ కొద్దిగా నీళ్లు చల్లి, మూతపెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. అడుగంటకుండా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.
-బంగాళదుంపలు దాదాపు ఉడికిపోయిన తర్వాత, మంటను సిమ్ లేదా మీడియంలో పెట్టి మూత తీసేయండి. ముక్కలు మంచి బంగారు వర్ణంలోకి మారి, కరకరలాడే వరకు నెమ్మదిగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడే అసలైన రుచి దాగి ఉంటుంది.
-చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను ఫ్రై పైన చల్లి, స్టవ్ ఆఫ్ చేయండి. ఆ కొత్తిమీర సువాసన వేడి వేడి బంగాళదుంపలకు పట్టి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.
-అంతే నోరూరించే, కరకరలాడే బంగాళదుంప ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
