Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తమిళనాడు స్టైల్ సాంబార్ రైస్..ఉదయం హడావిడిలో సులభంగా చేసుకునే రుచికరమైన వంటకం!
ఉదయం ఆఫీసుకో, పిల్లల స్కూలుకో ఆలస్యం అవుతున్నప్పుడు, త్వరగా అయిపోయేలా, అదే సమయంలో కడుపు నిండా తినేలా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుందా? అయితే తమిళనాడు స్టైల్ సాంబార్ రైస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.కేవలం అల్పాహారంగానే కాదు, మధ్యాహ్న భోజనానికి (Lunch) కూడా ఇది చాలా బాగుంటుంది.
హోటల్స్ లో దొరికే వేడి వేడి సాంబార్ రైస్ రుచిని మీరు ఎప్పుడైనా ఆస్వాదించారా? సరిగ్గా అదే రుచితో, ఇంకా చెప్పాలంటే అంతకంటే అద్భుతమైన ఇంటి రుచితో, ఘాటైన మసాలాలతో నోరూరించే తమిళనాడు స్టైల్ సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలోఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు
కందిపప్పు: అర కప్పు
కూరగాయలు: మునక్కాయ, క్యారెట్, బీన్స్, పొటో, టమోటా, ఉల్లి
పల్లీలు: కొన్ని
సాంబార్ పొడి: 2 టేబుల్ స్పూన్లు
చింతపండు: నిమ్మకాయ సైజు
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కరివేపాకు.
ఇతరాలు: పసుపు, ఉప్పు, కొత్తిమీర, నెయ్యి, చిన్న బెల్లం ముక్క.
తయారీ విధానం
-ముందుగా బియ్యం, కందిపప్పు (లేదా పెసరపప్పు) శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
-ఒక కుక్కర్ తీసుకుని అందులో కడిగిన బియ్యం, పప్పు, పచ్చి వేరుశనగ గుళ్లు వేయాలి. దీనికి తగినన్ని నీళ్లు (సాధారణ అన్నం కంటే కాస్త ఎక్కువ నీళ్లు పోయాలి), చిటికెడు పసుపు, కొద్దిగా నూనె వేసి మూత పెట్టాలి. సుమారు 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. సాంబార్ రైస్ కాస్త మెత్తగా ఉంటేనే రుచి బాగుంటుంది.
-ఈలోపు స్టవ్ మీద మరో పాత్ర పెట్టి, అందులో తరిగిన కూరగాయల ముక్కలన్నీ (ఉల్లి, టమోటా, క్యారెట్, బీన్స్, మునక్కాయ మొదలైనవి) వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పొడి, చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం మరుగుతుండగా మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు కుక్కర్ లో ఉడికించిన మెత్తటి అన్నం-పప్పు మిశ్రమాన్ని, ఈ మరుగుతున్న సాంబార్ కూరగాయల మిశ్రమంలో కలపాలి. అవసరమైతే మరికొన్ని వేడి నీళ్లు పోసి, జారుగా ఉండేలా చూసుకోవాలి సన్నని మంటపై మరో 5 నిమిషాలు ఉడికించాలి, తద్వారా మసాలాలన్నీ అన్నానికి బాగా పడతాయి.
-చివరగా చిన్న కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. ఈ తాలింపును ఉడుకుతున్న సాంబార్ రైస్ లో వేసి బాగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే వేడి వేడి, ఘుమఘుమలాడే తమిళనాడు స్టైల్ సాంబార్ రైస్ రెడీ. దీనిని అప్పడాలు, చిప్స్ లేదా బూందీతో సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







