Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మటన్ లవర్స్ కోసం కొత్త కిక్.. ఫిదా అయిపోతారు..రెస్టారెంట్ స్టైల్ మటన్ కాళీ మిర్చ్ ఇంట్లోనే చేసుకోండిలా..
మన దేశ వంటకాల్లో నాన్ వెజ్ కేటగిరీలో మటన్ కూరలకు ప్రత్యేక స్థానం ఉంది. మటన్ తో రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా మటన్ కాళీ మిర్చ్ వంటకాన్ని మీ ఇంట్లో వండారా? ఇది రాజసం ఉట్టిపడే వంటకం. తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉండే ఈ వంటకం రుచి చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. వీకెండ్ లో మీ కుటుంబభ్యులను,అతిథులను కొత్త రుచితో ఆశ్చర్యపర్చాలనుకుంటే ఈ మటన్ కాళీ మిర్చ్ బెస్ట్ ఆప్షన్. మటన్ కాళీ మిర్చ్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎముకలతో ఉన్న లేత మటన్: 1 కిలో
గట్టి పెరుగు: 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: 1 టేబుల్ స్పూన్
నల్ల మిరియాల పొడి: 1 టేబుల్ స్పూన్
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 3 పెద్దవి
జీడిపప్పు: 15-20
పచ్చి మిర్చి: 4-5
దాల్చిన చెక్క: 2 అంగుళాల ముక్క
లవంగాలు: 4-5
యాలకులు: 4
బిర్యానీ ఆకు: 2
షాజీరా: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: 1 టీస్పూన్
వేడి నీరు లేదా మటన్ స్టాక్: 2 కప్పులు
ఫ్రెష్ క్రీమ్: 3-4 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: 1 టీస్పూన్
కొత్తిమీర: కొద్దిగా
అల్లం తరుగు: 1 అంగుళం
తయారీ విధానం
-ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నీరుంటే మసాలాలు సరిగా పట్టవు.
-తర్వాత ఒక పెద్ద గిన్నెలో మటన్ ముక్కలను వేసి ఇందులోనే గట్టి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి కలపండి. ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టేలా చేతితో బాగా కలపి గిన్నెపై మూత పెట్టి కనీసం 2-3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టండి. ఇంకా మంచి రుచి కోసం, రాత్రంతా నానబెడితే మటన్ చాలా మృదువుగా, జ్యూసీగా మారుతుంది.
-తర్వాత నానబెట్టిన జీడిపప్పును నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీరు చేర్చుకోవచ్చు.
-తర్వాత ఉల్లిపాయలను కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ పై పెట్టి నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత మంటను తగ్గించి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేయండి. చిటపటలాడుతూ, వాటి సువాసన బయటకు వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను వేసి పెద్ద మంటపై 5-7 నిమిషాల పాటు వేయించండి. మటన్ ముక్కల రంగు మారి, కొద్దిగా వేగినట్లు కనిపించే వరకు వేయించడం ముఖ్యం.
-తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో నిమిషం పాటు కలపండి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపండి. ఒక రెండు నిమిషాల తర్వాత వేడి నీరు లేదా మటన్ స్టాక్ పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలిపి గ్రేవీ ఉడకడం ప్రారంభమయ్యాక మూత పెట్టండి. ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నట్లయితే పెద్ద మంటపై 1 విజిల్, చిన్న మంటపై 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకించాలి. సాధారణ గిన్నెలో వండుతున్నట్లయితే తక్కువ మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ మటన్ పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి.
-తర్వాత మూతతీసి తాజాగా దంచిన 2-3 టేబుల్ స్పూన్లు నల్ల మిరియాల పొడిని వేసి బాగా కలిపి తక్కువ మంటపై 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు తాజా క్రీమ్ వేసి, నెమ్మదిగా కలపండి. క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు, లేదంటే అది విరిగిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఒక నిమిషం ఉంచి, స్టవ్ ఆఫ్ చేయండి.
-చివరగా చేతితో నలిపిన కసూరి మేతి, గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం తరుగు వేసి కలపండి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు వదిలేయండి. దీనివల్ల అన్ని రుచులు ఒకదానితో ఒకటి కలిసి, కూర మరింత రుచిగా తయారవుతుంది. అంతే నోరూరించే ఘుమఘుమలాడే మటన్ కాళీ మిర్చ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







