Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కేవలం 15 నిమిషాల్లో..చపాతీలోకి సూపర్ కాంబినేషన్ పాలక్ ఎగ్ భుర్జీ
సాధారణంగా మనం కోడిగుడ్డుతో ఆమ్లెట్ లేదా సాధారణ భుర్జీ చేసుకుంటాం. కానీ అందులో పాలకూర చేర్చడం వల్ల దాని రుచి రెట్టింపు అవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆకుకూరలు తినడానికి మారం చేసే పిల్లల నుండి, బరువు తగ్గాలనుకునే పెద్దల వరకు అందరికీ పాలక్ ఎగ్ బుర్జీ ఒక అద్భుతమైన ఆప్షన్.
ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనంలో చపాతీతో తినడానికి ఇది చాలా బాగుంటుంది. కేవలం 15-20 నిమిషాల్లో దీనిని సులభంగా మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు: 4-5
పాలకూర: 1 పెద్ద కట్ట
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
పచ్చిమిర్చి: 2-3
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నూనె లేదా వెన్న: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: అర టీస్పూన్
పసుపు: 1పావు టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా పాలకూరను వేర్ల నుండి వేరు చేసి శుభ్రమైన నీటిలో రెండు మూడు సార్లు కడగాలి. ఆకుకూరల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా కడగడం ముఖ్యం. తర్వాత నీరు మొత్తం పోయేలా వడకట్టి ఆకులను చాలా సన్నగా తరగాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో నూనె లేదా వెన్న వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కడాయిలో వేయాలి. ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు సుమారు 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలను వేసి, మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.
-టమోటాలు మెత్తబడ్డాక మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం నుండి నూనె పైకి తేలే వరకు 2 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూరను కడాయిలో వేయాలి. పాలకూర వేసిన వెంటనే ఎక్కువగా కనిపిస్తుంది కానీ వేడి తగలగానే తగ్గిపోతుంది. పాలకూరలోని నీరు మొత్తం ఇగిరిపోయే వరకు బాగా వేయించాలి. ఆకుకూర పచ్చిగా ఉంటే రుచి బాగోదు.
-పాలకూర మిశ్రమం వేగిన తర్వాత, గుడ్లను పగలగొట్టి నేరుగా కడాయిలో వేయండి. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా ఇప్పుడే వేయాలి. గుడ్లు వేసిన వెంటనే కలపకుండా ఒక 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి. తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుతూ పొరటులాగా చేయాలి.
-గుడ్డు మిశ్రమం బాగా ఉడికి పొడిపొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా వేయిస్తే గుడ్డు గట్టిగా మారుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడి పాలక్ గుడ్డు భుర్జీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
