Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
రోడ్డు పక్కన బండి మీద దొరికే దోశ సాంబార్..ఆ ఒక్క పదార్థంతో చిక్కగా, కమ్మగా!
పొద్దున్నే వేడివేడిగా దోశ లేదా మెత్తటి ఇడ్లీ ప్లేటులో ఉంటే దానికి తోడుగా కొబ్బరి చట్నీ, కారప్పొడి ఉన్నా మన మనసు మాత్రం కొన్నిసార్లు ప్రత్యేకమైన సాంబార్ కోసం వెతుకుతుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన చిన్న బండ్ల మీద దొరికే సాంబార్ రుచి అమోఘం. ఆ సాంబార్ లో దోశను ముంచుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
ఆ సాంబార్ ప్రత్యేకత ఏంటంటే.. అది కేవలం పప్పుతోనే కాదు, దానిలో వాడే పదార్థాల మిశ్రమం దానికి ఆ అద్భుతమైన రుచిని ఇస్తుంది. పుల్లపుల్లగా ఉండే టమోటాలు, ఘుమఘుమలాడే సాంబార్ పొడి, ఒక చిన్న రహస్య పదార్థం.. అదే శనగపిండి. రుచికరమైన రోడ్ సైడ్ దోశ సాంబార్ ను ఇంట్లోనే, అంతే రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు- 10-15
పెద్ద టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 2
పచ్చిమిర్చి - 3
ఇంగువ - చిటికెడు
క్యారెట్ - 1
పసుపు గుమ్మడికాయ ముక్కలు - అర కప్పు
సాంబార్ పొడి - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
నీరు - అవసరమైనంత
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పోపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్ కంటే తక్కువ
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - ఒక రెమ్మ

తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి, ఒక ప్రెషర్ కుక్కర్ లో తీసుకోండి. పప్పు మునిగేంత నీరు పోసి పది నిమిషాల పాటు నాననివ్వండి.
-ఇప్పుడు అదే కుక్కర్ లో చిన్న ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు, సాంబార్ పొడి, పసుపు, ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు ఒక టీస్పూన్ నూనె వేయండి. మరో కప్పు నీళ్లు పోసి బాగా కలపండి. కుక్కర్ మూతపెట్టి, స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-పప్పు, కూరగాయలు మెత్తగా ఉడికిపోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి, పప్పు గరిటతో లేదా మాషర్ తో మెత్తగా అయ్యేలా కొద్దిగా మెదపండి. కూరగాయ ముక్కలు మరీ గుజ్జులా కాకుండా చూసుకోండి.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి సాంబార్ కావలసినంత చిక్కగా లేదా పల్చగా ఉండేలా వేడి నీటిని కలుపుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి.
-ఈలోపు ఒక చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని, ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సాంబార్ లో పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ చిక్కగా, మంచి రుచితో వస్తుంది.
-చివరగా పోపు కోసం వేరే చిన్న పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మెంతులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఈ ఘుమఘుమలాడే పోపును మరుగుతున్న సాంబార్ లో కలపాలి.
-పైన కొత్తిమీర చల్లి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే, కమ్మనైన రోడ్ సైడ్ దోశ సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
