Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చెట్టినాడు స్టైల్ ఎండుమిర్చి పచ్చడి..దోశలు,ఇడ్లీలు లెక్కలేకుండా తినేస్తారు!
మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో గ్రామం మారుతుంటే అక్కడి యాస, భాష మారినట్టే... వంటకాల రుచులు, వండే పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ఆహార ప్రియుల విషయానికి వస్తే మాత్రం చెట్టినాడు వంటకాలది ఎప్పుడూ పైచేయే.
ఎక్కడ చూసినా హోటల్ బోర్డుల మీద చెట్టినాడు మెస్ లేదా చెట్టినాడు స్టైల్ అని రాసి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. అంతలా ప్రజల మనసుల్లో ఈ రుచులు ముద్రవేసుకున్నాయి. చెట్టినాడు వంటకాలంటేనే ఘాటు, మసాలాల దట్టాయింపు. మరీ ముఖ్యంగా అక్కడి చట్నీలు చాలా ఫేమస్.

ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి టిఫిన్లలోకి వారు చేసే పచ్చళ్ళు అమృతతుల్యంగా ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన, నోరూరించే వంటకమే చెట్టినాడు ఎండుమిర్చి పచ్చడి. ఈ స్పైసీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
నువ్వుల నూనె: 2 టేబుల్ స్పూన్లు
మిరపకాయలు: 10 కాశ్మీరీ రకం, 5 సాధారణ రకం
సాంబార్ ఉల్లిపాయలు: 15- 20
వెల్లుల్లి: 10 రెబ్బలు
చింతపండు: ఒక చిన్న ఉసిరికాయంత
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం: 1 టీస్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు.
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కాశ్మీరీ ఎండుమిర్చి, సాధారణ ఎండుమిర్చి,చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత రాతి ఉప్పు, చింతపండు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులు లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే తాజా కరివేపాకు వేయాలి. ఇక్కడే అసలైన సువాసన మొదలవుతుంది.
-తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్ట్ ను కడాయిలో వేయాలి. మంటను సిమ్ లేదా మీడియంలో ఉంచి పచ్చడిని బాగా వేయించాలి. పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలేంత వరకు (సుమారు 5-7 నిమిషాలు) ఉడికించాలి.
-చివరగా దించే ముందు మిగిలిన ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను పచ్చడిలో కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘాటైన, రుచికరమైన చెట్టినాడు స్టైల్ ఎండుమిర్చి పచ్చడి రెడీ.
-వేడి వేడి ఇడ్లీలు లేదా క్రిస్పీ దోశతో పాటు ఈ పచ్చడిని వడ్డించుకుని, పక్కన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications