నోటికి రుచిగా.. ఆరోగ్యానికి మంచిగా..శెనగపిండి లేకుండా ప్రొటీన్ పకోడి..రెసిపీ ఇదే

Posted By:

భారతీయ వంటకాల్లో సాయంత్రం వేళ స్నాక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి పకోడీలు లేదా బజ్జీలు. అయితే నూనెలో వేయించిన పదార్థాలు అనారోగ్యకరమని చాలామంది వీటిని దూరం పెడుతుంటారు. కానీ మనం ఎంచుకునే పదార్థాలను బట్టి, వండే విధానాన్ని బట్టి స్నాక్స్ కూడా పోషకాలను అందించగలవు.

అలాంటి ఒక ఆరోగ్యకరమైన, సంప్రదాయ వంటకమే పొట్టు పెసరపప్పు పకోడి. దీనిని ప్రొటీన్ పకోడి అని అని కూడా పిలుస్తారు. శెనగపిండి లేకుండా తయారయ్యే ప్రొటీన్ పకోడి తినడం మొదలుపెడితే ఆపేపనే ఉండదు. పెసరపప్పు పకోడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Ultimate Tea Time Snack Crispy and Healthy Protein Pakoda Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పొట్టు పెసరపప్పు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-అల్లం
-వెల్లుల్లి
-కరివేపాకు
-పుదీనా
-జీలకర్ర
-ధనియాలు
-ఆయిల్

తయారీ విధానం

-ముందుగా 1 కప్పు పొట్టుతో ఉండే పెసరపప్పుని గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి.

-2 గంటల తర్వాత నానబెట్టిన పెసరపప్పుని మరొక్కసారి శుభ్రంగా కడిగి నీరు వంపేయండి.

-నానబెట్టిన పెసరపప్పులో ఒక గుప్పెడు పప్పుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పెసరపప్పును కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసుకుంటూ మెత్తగా కాకుండా, కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు అస్సలు పోయకూడదు.

-కోర్సుగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని,ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు కప్పు పచ్చిమిర్చి తరుగు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు, పావు కప్పు పుదీనా ఆకులు వేసి మొత్తం బాగా కలుపుకోండి.

-కలిపిన పిండి లూజ్ గా, మెత్తగా ఉండకూడదు..కొంచెం రఫ్ గా ఉండాలి. లుపుతున్నప్పుడు పిండి లూజ్ గా అనిపిస్తే అందులో 1-2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు . కలిపిన పిండి లూజ్ గా, మెత్తగా ఉండకూడదు..కొంచెం రఫ్ గా ఉండాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక మంటను మీడియంలో ఉంచి కలుపుకున్న పిండిని పకోడీలుగా వేసి వేయించుకోవాలి.

-పకోడీలు క్రిస్పీగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వాటిని బాండీలో నుంచి బయటకు తీసేయాలి. అంతే ప్రొటీన్ పకోడి రెడీ. దీనిని నచ్చిన చట్నీతో తింటే స్వర్గం కనబడుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 3, 2026, 6:41 [IST]
Desktop Bottom Promotion