Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తక్కువ నూనెతో, సహజ తీపితో నోరూరించే ఆంధ్రా స్పెషల్ స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆంధ్రాలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ పిండివంటకం చలిమిడి. సాధారణంగా శుభకార్యాల్లో,పండుగల సమయంలో ముఖ్యంగా పెళ్లిళ్లు,సీమంతాలు,ఇతర వేడుకల్లో దేవుడికి నైవేద్యంగా లేదా అతిథులకు ప్రత్యేకమైన స్వీట్ గా దీనిని తయారుచేస్తుంటారు. ఇది చాలా రుచిగా ఉండి,సులభంగా జీర్ణమవుతుంది. చలిమిడి కేవలం రుచికరమైన పిండివంటకం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది.
చలిమిడిని తయారుచేసే విధానం (తక్కువ నూనె, సహజమైన తీపి) వల్ల ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుందని,శరీరానికి చలవ చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే దీనిని చలిమిడి (చల్లని పిండి) అంటారు. గర్భధారణ, ప్రసవం తరువాత మహిళలకు చలిమిడి ఇవ్వడం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. శక్తిని, పోషకాలను అందించి బాలింతలు త్వరగా కోలుకోవడానికి, పాలు ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. చలిమిడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చలిమిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రేషన్ బియ్యం
-నెయ్యి
-ఎండుకొబ్బరి
-జీడిపప్పు
-చక్కెర
-యాలకల పొడి
చలిమిడి తయారీ విధానం
-రెండుంబావు గ్లాసుల రేషన్ బియ్యాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 6-8గంటల సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత బియ్యాన్ని ఒకసారి కడిగేసి నీటిని వంపేసి జాలిగిన్నెలో వేసి 5 నిమిషాలు వదిలేయండి.
-తర్వాత ఓ కాట్ క్లాత్ ను పరిచి దానిమీద పలుచగా బియ్యాన్ని పరుచుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద లేదా ఎండలో గానీ పెట్టకూడదని గుర్తుంచుకోండి. తర్వాత చేత్తో తాకి చూస్తే బియ్యం చల్లగా ఉండాలి. పూర్తిగా తడి ఆరిపోకూడదు.
-ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన పిండిని జల్లెడ గిన్నెలో వేసి ఓ ప్లేట్ లోకి జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని చేత్తో ఒకసారి బాగా వత్తి పైన మూతపెట్టేసి పక్కన ఉంచుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద అడుగుమందంగా ఉండే గిన్నె పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 1 చిన్న కప్పు ఎండుకోబ్బరి ముక్కలు వేసి అవి సగం వరకు వేగాక ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించుకున్నాక నెయ్యితో సహా వీటిని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నెలోనే 1 పెద్ద గ్లాసు చక్కెర వేసి పావు కప్పు పైనే నీళ్లు పోసి కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. లేత ఉండపాకం వచ్చేదాకా ఉడికించాక ఇందులో మెత్తగా దంచిన 4 యాలకల పొడిని వేసి కలిపాక రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చలిమిడి కొంచెం జారుగా వచ్చేదాకా పిండిని కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో వేయించిన జీడిపప్పు, కొబ్బరిముక్కలను నెయ్యితో సహా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా కలుపుకోవచ్చు. అంతే టేస్టీ చలిమిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







