Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
జలుబు,దగ్గు,జ్వరానికి దివ్యౌషధం..మిరియాల అన్నం ఇలా చేసుకుంటే కేక అంతే
మనదేశంలో ముఖ్యంగా దక్షిణ బారతదేశంలో తరచుగా తయారుచేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల్లో మిరియాల అన్నం ఒకటి. మిరియాలు దాని ఘాటైన రుచి, ఔషధ గుణాల కారణంగా ఈ వంటకానికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తాయి. మిరియాలలో పెపరిన్ అనే శక్తివంతమైన రసాయనం ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మిరయాల అన్నం ముఖ్యంగా చలికాలంలో లేదా జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ ఫుడ్ గా పరిగణించబడుతుంది.
మిరియాల అన్నం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, దీనిని మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనంలో తీసుకోవచ్చు. నెలకొకసారైనా లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడైనా ఈ సులభమైన, పోషక విలువలు కలిగిన మిరియాల అన్నం రెసిపీని ప్రయత్నించడం మంచిది. ఇది కడుపు నొప్పి మరియు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం, చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది. లంచ్ బాక్సుల్లో పట్టుకెళ్లడానికి కూడా బాగుంటుంది. మిరియాల అన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిరియాల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిరియాలు
-జీలకర్ర
-బాస్మతి బియ్యం
-పచ్చిమిరపకాయ
-కరివేపాకు
-నెయ్యి
-కొత్తిమీర
-జీడిపప్పు
మిరియాల అన్నం తయారీ విధానం
-ముందుగా 1 కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగాక అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీలో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. మిరియాలు పలుకుగా లేకుండా దంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేశాక అందులో 15 జాడిపప్పు పలుకులు, 1 రెమ్మ కరివేపాకు తురుము, 1 పచ్చిమిరపకాయ చీలికలు వేసి సన్నని సెగ మీద వేయించుకోవాలి.
-తర్వాత అందులో ముందుగా దంచి ఉంచుకున్న మిరియాల జీలర్ర పొడిని వేసి నేతిలో మంచిగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో ఉడికిన బాస్మతి రైస్ వేసి,రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి.
-మొత్తం కలిసిపోయిన తర్వాత మంటను పెంచి అన్నం పొగలు కక్కేదాకా కలుపుతూ ఉండాలి.
-చివరిగా కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ మిరియాల అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
