ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్‌ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్‌ సెంటర్‌ స్టైల్‌ టొమాటో చట్నీ.!

టిఫిన్స్‌ ఎంత స్పెషల్‌గా ఉన్నా వాటిలోకి పర్ఫెక్ట్‌ చట్నీ పడితేనే దాని రుచి రెట్టింపవుతుంది. అలాంటి చట్నీల్లో స్పైసీ టొమాటో చట్నీ ఒకటి. వేడివేడిగా స్పాంజీ ఇడ్లీల్లోకి ఈ స్పైసీ చట్నీతో తింటే స్వర్గమే. ఇక వేడివేడి అన్నంలోకి కూడా ఈ పచ్చడి టేస్ట్‌ చూస్తే వదలకుండా తినేస్తారు. ఈ క్రమంలో మార్నింగ్‌ కిచెన్‌లో హడావుడి లేకుండా ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా ఈ టిఫిన్‌ సెంటర్‌ స్టైల్‌ టొమాటో చట్నీ చేయండి.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌లోకి పర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతుంది. ఇంకో రెండు ఇడ్లీలతో పాటు లంచ్‌లో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు..

tiffin centre style tomato chutney for breakfast and lunch at a time in easy process

టిఫిన్‌ సెంటర్‌ టొమాటో స్టైల్‌ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
వేరుశనగలు- పావు కప్పు
వేయించిన శనగపప్పు- పావు కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు- అర కప్పు
వెల్లుల్లి- ఆరు రెబ్బలు
పచ్చిమిర్చి- రెండు
చింతపండు- కొద్దిగా
కశ్మీరీ రెడ్‌ చిల్లీ- ఏడు
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉల్లిపాయలు- రెండు
టమాటాలు- నాలుగు (మీడియం సైజు)
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర- గుప్పెడు

తాలింపు కోసం

నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
మినప్పప్పు- రెండు టీస్పూన్లు
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- రెండు టీస్పూన్లు
ఎండుమిర్చి- నాలుగు
కరివేపాకు- రెండు రెబ్బలు
ఇంగువ- అర టీస్పూన్‌

టిఫిన్‌ సెంటర్‌ స్టైల్‌ టొమాటో చట్నీ తయారీ విధానం

టొమాటో చట్నీ కోసం ముందుగా స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో వేరుశనగలు వేసి వేయించాలి. తర్వాత వేయించిన శనగపప్పు వేసి కలుపుకోవాలి.

tiffin centre style tomato chutney for breakfast and lunch at a time in easy process

వేగిన తర్వాత పచ్చికొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు, కశ్మీరీ రెడ్‌ చిల్లీ, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి.

పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే 'బయోటిన్‌ డ్రింక్‌’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.!

ఇవన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్‌లో తీసుకుని చల్లారనివ్వాలి.

ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్‌ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.

tiffin centre style tomato chutney for breakfast and lunch at a time in easy process

ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని చల్లారిన వేరుశనగ మిశ్రమాన్ని వేసుకుని రుబ్బుకోవాలి. తర్వాత టమాటా, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని మెత్తగా చేసుకోవాలి.

కొన్ని నీళ్లు పోసి గ్రైండ్‌ చేసుకుంటే చట్నీ మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌లో తీసుకుని ఈ చట్నీని వేసుకుని మీకు కావాల్సిన విధంగా నీళ్లు పోసుకుని గరిటెతో కలియతిప్పాలి. ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొంచెం కలుపుకోవచ్చు.

నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఇప్పుడు తాలింపు కోసం స్టవ్‌పైన చిన్న పాన్‌ పెట్టుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి వేగిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

ఈ తాలింపును టొమాటో చట్నీలో వేసుకుని కలుపుకోవడమే.. ఈ స్పైసీ టొమాటో చట్నీ వేడివేడి ఇడ్లీల్లోకి ఇంకా లంచ్‌లో వేడివేడి అన్నంలోకి అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 25, 2026, 7:30 [IST]
q
Desktop Bottom Promotion