Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే..
వీకెండ్ లో సాధారణంగా మనం ఇంట్లో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ లేదా బిర్యానీ చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా కాస్త వెరైటీగా, ఆరోగ్యకరంగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే పుదీనా చికెన్ పర్ఫెక్ట్ ఆప్షన్. పుదీనాలో ఉండే సహజమైన సువాసన, చికెన్ తో కలిసినప్పుడు వచ్చే అద్భుతమైన రుచి వర్ణించలేనిది. పైగా పుదీనా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఘుమఘుమలాడే వాసనతో, నోటికి ఎంతో రుచిగా తగిలే ఈ పుదీనా చికెన్ గ్రేవీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

పుదీనా చికెన్ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్- అర కిలో
పుదీనా ఆకులు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పసుపు పొడి - పావు టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
నల్ల మిరియాల పొడి - పావు టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
స్టార్ అనాస - 1
దాల్చినచెక్క - చిన్న ముక్క
లవంగాలు - 5
యాలకులు - 2
అల్లం - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
పచ్చి మిరపకాయలు - 5
కొత్తిమీర - కొద్దిగా
నూనె -4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

పుదీనా చికెన్ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన తాజా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా, మెత్తటి పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ వల్లే చికెన్ కు అసలైన రుచి వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న బాండీ పెట్టాలి. అందులో తగినంత నూనె వేసి వేడి అయ్యాక స్టార్ అనాస, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేంత వరకు రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను బాండీలో వేయాలి. దీనికి కొద్దిగా పసుపు జోడించి బాగా కలపాలి. మంటను మీడియంలో పెట్టి సుమారు 5 నిమిషాల పాటు చికెన్ ను నూనెలో మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పచ్చివాసన పోతుంది.
-5 నిమిషాల తరువాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా-కొత్తిమీర మసాలా పేస్ట్ ను అందులో వేసి ముక్కలన్నింటికీ పట్టేలా కలుపుకోవాలి. ఆపై గ్రేవీకి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, రుచికి తగినంత ఉప్పు, అలాగే గరం మసాలా పొడి, మిరియాల పొడి, అవసరమైతే కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
-ఇప్పుడు బాండీపై మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి. అడుగు మాడిపోకుండా మధ్యమధ్యలో మూత తీసి గరిటతో కలుపుతూ ఉండాలి. చికెన్ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలుతున్న సమయంలో చివరగా కొత్తిమీర ఆకులతో అలంకరించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే పుదీనా చికెన్ గ్రేవీ రెడీ. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరాఠా, నాన్ లేదా బగారా రైస్ లోకి అద్భుతమైన కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
