Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్!
యంత్రం సమయంలో చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎక్కువగా తింటుంటారు. అయితే ఎగ్ రైస్ ఎప్పుడూ ఒకటే రకం తింటూ ఉంటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈ సారి కొత్తగా టమాటా వెల్లుల్లి ఎగ్ రైస్ ట్రై చేయండి. వెల్లుల్లి ఘాటు, టమాటా పులుపు, గుడ్డు కమ్మదనం.. ఈ మూడు కలిస్తే వచ్చే రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. లంచ్ బాక్స్ కోసం కోసం ఈ బాగుంటుంది.

టమాటా వెల్లుల్లి ఎగ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - పావు కప్పు (పొట్టు తీసినవి)
పెద్ద టమాటా - 1 (ముక్కలుగా తరిగినది)
కరివేపాకు - కొద్దిగా
కారం - అర టేబుల్ స్పూన్
ఉడికించిన బాస్మతి బియ్యం - 1 కప్పు
గుడ్లు - 4
నూనె - పావు కప్పు
ఆవాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - మీ రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా
టమాటా వెల్లుల్లి ఎగ్ రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, మరియు కారం వేయండి. వీటన్నింటినీ నీళ్లు పోయకుండా, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో పావు కప్పు నూనె పోసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడించండి.
-ఆవాలు వేగిన తర్వాత, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించండి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా వెల్లుల్లి పేస్ట్ ను పాన్ లో వేయండి. మంటను మీడియంలో ఉంచి, పేస్ట్ లోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. మసాలా వేగి, నూనె పైకి తేలుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు వేగుతున్న మసాలాలో 4 గుడ్లను పగలగొట్టి వేయండి. వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఆగి, ఆ తర్వాత గరిటతో బాగా కలపండి. మసాలాతో గుడ్డు బాగా కలిసేలా చూసుకోండి.
-గుడ్డు మిశ్రమం బాగా ఉడికిన తర్వాత, ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని అందులో వేయండి. చివరగా కొత్తిమీరను చల్లండి. ఇప్పుడు మసాలా, అన్నం అన్నీ ఒకదానికొకటి బాగా పట్టేలా నిదానంగా కలుపుకోండి. అన్నం మెతుకులు విరిగిపోకుండా జాగ్రత్తగా టాస్ చేసుకోండి.
-అంతే గుమగుమలాడే టమాటా వెల్లుల్లి ఎగ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications