Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఉడుపి హోటల్ స్పెషల్..కమ్మనైన,కారమైన తన్నీ చట్నీ.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
రోజూ ఉదయాన్నే చేసే ఇడ్లీకి ఎప్పుడూ ఒకేరకమైన కొబ్బరి చట్నీ చేసి విసుగు చెందారా? మీ కుటుంబ సభ్యులు కూడా కొత్త రుచి కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈసారి మీ వంటగదిలో ఓ చిన్న మ్యాజిక్ చేసి, కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి హోటళ్లలో వడ్డించే అసలైన తన్నీ చట్నీని ప్రయత్నించండి. దీనిని నీరు చట్నీ అని మనం పిలుస్తుంటాం.
తన్నీ అంటే నీళ్లు. పేరుకు తగ్గట్టే ఈ చట్నీ కాస్త పల్చగా, కమ్మటి కొబ్బరి రుచితో, పచ్చిమిర్చి ఘాటుతో, నోరూరించే తాళింపు సువాసనతో అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ ఒక్కసారి రుచి చూశారంటే మామూలుగా తినే ఇడ్లీల కన్నా కచ్చితంగా రెండు ఎక్కువ తింటారు. అంతటి రుచి దీని సొంతం. ఆ ఘుమఘుమలాడే చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 6 (మీ కారానికి తగినట్టు)
కరివేపాకు - ఒక రెమ్మ
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
అల్లం - అర అంగుళం ముక్క
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
నీరు - అవసరమైనంత
తాళింపు కోసం:
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
ఎండు మిర్చి - 1
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులోనే జీడిపప్పు, వేరుశనగపప్పు వేసి మంచి సువాసన వస్తూ దోరగా బంగారు రంగులోకి మారే వరకు వేయించి, స్టవ్ ఆపి చల్లారనివ్వాలి.
-చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దానికి పచ్చి కొబ్బరి తురుము, అల్లం ముక్క, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర జోడించండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని ముద్దలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి మార్చి సుమారు ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ చట్నీ ప్రత్యేకతే దాని పల్చటిదనం, కాబట్టి జారుగా ఉండేలా చూసుకోండి.
-చివరిగా తాళింపు కోసం చిన్న పాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, ఈ ఘుమఘుమలాడే తాళింపును చట్నీపై వేసి కలపండి. అంతే కమ్మనైన, కారమైన ఉడుపి హోటల్ స్టైల్ తన్నీ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
