Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
Tomato Pickle: టామాటో పచ్చడిని ఇలా చేసుకుంటే అదిరిపోతుంది..దేంతో తిన్నా ఆహా అనాల్సిందే
అటు అన్నంలోకి,ఇటు బ్రేక్ ఫాస్ట్ లో దోశ,ఇడ్లీలలో నంచుకోడానికి అయినా ఫర్ఫెక్ట్ చెట్నీ ఏదైనా ఉందంటే అందులో ముందువరుసలో ఉండేది టమాటో పచ్చడి(Tomato pachadi). టమాటో పచ్చడి ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మాకు వంటలు రావు అనేవాళ్లు కూడా ఈ రెసిపీని సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు. టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటో
-కరివేపాకు
-పచ్చి శెనగపప్పు
-ఆయిల్
-చింతపండు
-ఆవాలు
-వెల్లుల్లి
-కారం
-ఉప్పు
-మినపప్పు
-మెంతుల పొడి
-ఆవ పొడి
-ఇంగువ
-పసుపు
-ఎండు మిరపకాయలు

టమాటో పచ్చడి తయారీ విధానం
-ముందుగా బాగా పండిన అరకేజీ టమాటోలను ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత టమాటో ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి అందులోనే నిమ్మకాయ సైజు అంత చింతపండు,3 టేబుల్ స్పూన్ల కారం,10 వెల్లుల్లి రెబ్బలు,రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద లోతుగా ఉండే పాన్ పెట్టి అందులో ముప్పావు కప్పు ఆయిల్ పోసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీస్పూన్ ఆవాలు,1 టీస్పూన్,1 టీస్పూన్ మినపప్పు,1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి ఆవాలు చిటపటలాడేవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో కచ్చాపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు,5 ఎండు మిరపకాయలు,మూడు రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ,అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపుకోండి.
-పోపు అంతా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుసుకున్న పచ్చడిని వేసుకోవాలి.
-మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించండి. -ఉడుకుతున్న సమయంలోనే వేయించి పొడి చేసిన మెంతుల పొడి పావు టీ స్పూన్,వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవ పొడి పావు టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి.
-పచ్చడి కొంచెం రుచి చూసి ఉప్పు ఉంటే ఓకే లేకుంటే మాత్రం కొంచెం వేసి కలుపుకోండి.
-ఇప్పుడు పచ్చడిలో ఆయిల్ పైకి తేలినదాకా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్
చేసేయండి. టేస్టీ టమాటో పచ్చడి రెడీ.
-ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నెలలపైనే నిల్వ ఉంటుంది.
బయట పెట్టుకుంటే 20 రోజులదాకా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
