Latest Updates
-
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి! -
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం! -
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు.. -
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు -
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!
ఇడ్లీ, దోసెలలోకి ప్రతిరోజూ రొటీన్‌గా తినే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు తిని బోర్ కొట్టి, మీ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలని అడుగుతున్నారా? మనలో చాలామందికి టమాటా చట్నీ అంటే ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా, కాస్త వెరైటీగా టమాటాలకు మినపపప్పును జోడించి కమ్మటి చట్నీ తయారు చేసి చూడండి.
మినపపప్పు వల్ల చట్నీకి అద్భుతమైన రుచితో పాటు మంచి కమ్మదనం వస్తుంది. ఇది తయారు చేయడం చాలా సులభం. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెలతో ఈ చట్నీ కలుపుకుని తింటుంటే ఆహా అనిపించాల్సిందే. నోరూరించే టమాటో మినపపప్పు చట్నీ తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
మినపపప్పు - 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
వెల్లుల్లి - 10 రెబ్బలు
ఎండు మిరపకాయలు - 3
చింతపండు - చిన్న ముక్క
కొత్తిమీర - ఒక గుప్పెడు
కరివేపాకు - 1 రెమ్మ
టమాటాలు - 4
ఉప్పు - మీ రుచికి తగినంత
తాలింపు కోసం:
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు లేదా మెంతుల పొడి - 1 టీస్పూన్
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి!
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, మినపపప్పు వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి. పప్పు బంగారు గోధుమ రంగులోకి మారి కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-పప్పు వేగిన తర్వాత అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి
కొద్దిసేపు దోరగా వేయించాలి.
ఆ వెంటనే ఎండు మిరపకాయలు, చిన్న చింతపండు ముక్క వేసి కలపాలి. అలాగే
గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించండి.
-ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను పాన్ లో వేసి బాగా కలపండి. టమాటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా ఉడికేవరకు ఉంచి.. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని, రుచికి సరిపడా ఉప్పును జోడించి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-చట్నీకి అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. చివరగా స్టవ్ పై పోపు గరిటెను ఉంచి, నూనె వేడిచేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు, కాస్త పసుపు లేదా మెంతుల పొడి వేసి చిటపటలాడనివ్వండి. ఈ ఘుమఘుమలాడే పోపును చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన టమాటా మినపపప్పు చట్నీ రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
