Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ఆంధ్రా స్పెషల్ చింతచిగురు గుత్తివంకాయ కూర..వాసనకే ముత్తాతలు కూడా దిగొస్తారు..ఎలా చేయాలో చూడండి
వంకాయ..ఈ పేరు వింటే కొందరికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి,మరికొందరు మొఖం తిప్పేసుకుంటారు. వాస్తవానికి దీనిని సరిగ్గా వండితే దీన్ని మించిన టేస్ట్ ఎక్కడా దొరకదు. అందులోనూ చింతచిగురుతో గుత్తివంకాయ కూర చేస్తే ఇక మాటల్లో చెప్పలేని టేస్ట్ వస్తుంది. లేత చింతచిగురు పులుపు, గుత్తివంకాయల తియ్యటి రుచి కలగలిసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కూర అన్నం, రోటీ, చపాతీల్లోకి అదిరిపోతుంది. దీనిని తయారుచేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. మీ ఇంట్లోనే చాలా సులభంగా చింతచిగురు గుత్తివంకాయ కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చింతచిగురు గుత్తివంకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు
-గుత్తి వంకాయలు
-చింతచిగురు
-దాల్చిన చెక్క
-ఉప్పు
-పసుపు
-కారం
-పల్లీలు
-మెంతులు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-లవంగ మొగ్గలు
-ఆయిల్
-మినపప్పు
-కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి
-జీలకర్ర
-టమాటో
-ఉల్లిపాయ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-కరివేపాకు

తయారీ విధానం
-ముందుగా 100 గ్రాముల చింతచిగురు తీసుకొని కాడలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టీస్పూన్ల ఆయిల్ వేడి చేశాక అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు,చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి తక్కువమంట మీద బాగా వేయించుకోవాలి.
-ఇవి వేగుతున్నప్పుడే ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. అన్నీ దోరగా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆరబెట్టబడిన కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి అందులోనే 3 టీస్పూన్ల కారం, క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు, 2 టీస్పూన్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లా చేసుకోకూడదు.
Vankaya Bajji: స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీ..కొరికి కొరికి తినేస్తారు, ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు పావు కేజీ వంకాయలను శుభ్రంగా కడిగి వంకాయను నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్లలో వేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో కట్ చేసుకున్న వంకాయలను ఇందులో వేసి అవి మెత్తబడే దాకా బాగా వేగనిచ్చి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలో మిగిలిన ఆయిల్ లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు,జీలకర్ర,శెనగపప్పు,మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయల ముక్కలు, పొడవుగా చీరిన 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీస్పూన్ ఉప్పు,అర టీస్పూన్ పసుపు వేసి కలపండి.
-కొద్దిగా వేగాక ఇందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టమాటోని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసి అవి మెత్తగా మగ్గేదాకా వేపుకున్నాక ఇందులో గ్రైండ్ చేసిన చింతచిగురు పేస్ట్ వేసి కలపాలి.
-అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే సమయంలో 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి తర్వాత వేయించిన వంకాయలను ఇందులో వేయాలి. మూతపెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి దించేయాలి. అంతే చింతచిగురుతో గుత్తి వంకాయ కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications