Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆంధ్ర భోజన ప్రియుల కోసం..శక్తినిచ్చే అసలైన కంది పొడి
కంది పొడి కేవలం ఒక పొడి కాదు, అది ఒక అనుభూతి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ కంది పొడిని కలుపుకుని తింటుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. అమ్మ చేతి రుచిని, మన సంప్రదాయాన్ని గుర్తుచేసే ఈ కంది పొడి కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా మేటి.
ఇది మన శరీరానికి అందించే శక్తి మాత్రం అనంతం. కంది పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు తక్కువ, కానీ దాని రుచి మాత్రం అమోఘం. కంది పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కంది పప్పు - 1 కప్పు (200 గ్రాములు)
శనగ పప్పు- 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 15
జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ధనియాలు- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 6
చింతపండు -నిమ్మకాయంత
కరివేపాకు- రెండు రెమ్మలు
ఇంగువ- పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ మీద పెట్టి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు కంది పప్పు వేసి దోరగా వేయించాలి. పప్పు మంచి బంగారు రంగులోకి మారి, చక్కటి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి.
-వేగిన పప్పును ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో శనగ పప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అదే బాండీలో ఎండు మిరపకాయలు వేస, అవి కొద్దిగా ఉబ్బి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు బాండీలో వేసి అవి చిటపటలాడి, మంచి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి.
-ఇప్పుడు బాండీలో కరివేపాకు వేసి అందులోని తేమ పోయి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-వేయించుకున్న పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఎండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, వేయించుకున్న పప్పులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే కంది పొడి రెడీ.
-తయారు చేసుకున్న కంది పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే, దాని రుచి, సువాసన నెలల తరబడి ప్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications