Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
కూల్ డ్రింక్స్ వద్దు..ఆరోగ్యానికి అమృతమంటి పుదీనా మజ్జిగ..5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం పది గంటలకే బయటకు వెళ్లాలంటే భయపడే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలంలో శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. చెమట రూపంలో శరీరంలోని నీరు, ముఖ్యమైన లవణాలు బయటకు పోవడం వల్ల తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి.
ఇలాంటి సమయంలో మన శరీరాన్ని చల్లగా, ఉత్సాహంగా ఉంచుకోవడానికి ఏవైనా చల్లటి పానీయాలు తాగాలనిపిస్తుంది. చాలామంది దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్, సోడాలు, కృత్రిమ పండ్ల రసాలు తాగుతుంటారు. కానీ వాటిలో ఉండే అధిక చక్కెర, రసాయనాల వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మన పూర్వీకులు అందించిన అద్భుతమైన వేసవి పానీయం మజ్జిగ.

ఈ మజ్జిగకు కొద్దిగా పుదీనా, ఇతర సుగంధ ద్రవ్యాలు జోడించి పుదీనా మజ్జిగ తయారు చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. పుదీనా మజ్జిగ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
పుదీనా మజ్జిగ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెరుగు
-పుదీనా ఆకులు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-ధనియాలు
-ఇంగువ
-నల్ల ఉప్పు
-సాధారణ ఉప్పు
-చల్లటి నీళ్లు
-ఐస్ క్యూబ్స్
పుదీనా మజ్జిగ తయారీ విధానం
-ముందుగా పుదీనా మజ్జిగ కోసం ఒక పొడి తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముప్పావు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి సన్నని సెగ మీద జీలకర్ర రంగు మారుతూ పొగలు వచ్చే వరకు వేయించాలి.
-జీలకర్ర కాస్త వేగడం మొదలవ్వగానే అందులోనే రెండు పెద్ద చిటికెళ్ల ఇంగువ కూడా వేసి వేయించండి.
-జీలకర్ర నల్లబడటం మొదలయ్యి అందులో నుంచి పొగలు రావడం ప్రారంభమైన వెంటనే స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన జీలకర్ర-ధనియాల మిశ్రమం, 2 ఐస్ క్యూబ్స్, 4 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 పచ్చిమిరపకాయ, పిడికెడు పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మీగడ లేని పెరుగు ఒకటిన్నర కప్పు(300 ml)వేసి, ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా చిలకండి. తర్వాత ఇందులో నాలుగున్నర కప్పులు(1 కప్పు పెరుగుకి 3 కప్పుల నీళ్ల చొప్పున)చల్లటి నీళ్లు పోసి నురగ పైకి తేలేలా బాగా వేగంగా చిలుక్కోవాలి. అంతే సమ్మర్ రీఫ్రెషింగ్ డ్రింక్ పుదీనా మజ్జిగ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications