Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
మిగిలిపోయిన అన్నంతో పాలక్ పనీర్ రైస్..100కి 200 మార్కులు ఇవ్వొచ్చు..ఎలా చేసుకోవాలంటే
పాలక్ పనీర్ రైస్ అనేది రుచికరమైన, పోషకమైన వంటకం. ఇది పాలకూర, పనీర్ తో తయారు చేయబడిన భారతీయ వంటకం. పాలకూరలోని ఐరన్, విటమిన్స్, మినరల్స్..అలాగే పనీర్ లోని ప్రొటీన్లు, కాల్షియం వంటి పోషకాల కలయికతో ఈ వంటకం చాలా ప్రయోజనకరమైనది. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఇది వారం రోజులలో ఎప్పుడైనా తినడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని తయారుచేసుకోవచ్చు. పిల్లలకు పెద్దలకు లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూశారంటే అస్సలు వదిలిపెట్టరు. పాలక్ పనీర్ రైస్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలక్ పనీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలకూర
-బాస్మతి బియ్యం లేదా మిగిలిపోయిన అన్నం
-నెయ్యి
-నూనె
-జీలకర్ర
-ఎండుమిర్చి
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-ఉప్పు
-కారం
-ధనియాల పొడి
-కొత్తిమీర
-కసూరి మేథీ
-పనీర్ క్యూబ్స్
-అల్లం తరుగు
-నిమ్మరసం

తయారీ విధానం
-ముందుగా స్వట్ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ చక్కెర, 3 కట్టల పాలకూర(220 గ్రాముల వరకు)వేసి పెద్ద మంట మీద 4-5 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత స్టవ్ ఆపేసి పాలకూర ఆకును చన్నీళ్లలో వేసి అది చల్లారాకా మిక్సీ జారులో వేసి పావుకప్పు నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 15 వెల్లుల్లిపాయల సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి వెల్లుల్లిని కాస్త వేగనివ్వండి.
-వెల్లుల్లి మంచి సువాసన వస్తున్న సమయంలో అందులో 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపితే చాలు
-ఇప్పుడు అందులో 200 గ్రాముల పనీర్ క్యూబ్స్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి 4 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసి కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-పసరు వాసన పూర్తిగా పోయిన తర్వాత 1 టీస్పూన్ ధనియాల పొడి,అర టేబుల్ స్పూన్ కారం వేసి వేపాలి.
-పాలకూర ఉడికిన తర్వాత ఇందులో గంటన్నర సేపు నానబెట్టి ఉప్పు, నూనె వేసి వండిన బాస్మతి రైస్ లేదా మిగిలిపోయిన అన్నం పాన్ లో వేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి,1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ నలిపివేసి పెద్ద మంట మీద మెతుకు చిదిరిపోకుండా కలుపుకోవాలి.ఉప్పు చూసి కావాలనుకుంే వేసుకోండి.
-అన్నాన్ని మెత్తం పాలక్ కి పట్టించాక స్టవ్ ఆపి మూతపెట్టి పావు గంట వదిలేయండి. తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే పాలక్ పనీర్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications