For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టర్కీ మరియు పుట్టగొడుగుల పోట్ పై రిసిపి తయారు చేయడం ఎలా

Posted By: DEEPTHI T A S
|

సాధారణంగా అందరూ చికెన్ మరియు మష్రూమ్ పోట్ పై తయారుచేయడానికి ఇష్టపడతారు కానీ మేము ఇక్కడ ఒక సరికొత్త రెసిపిని మీకు పరిచయం చేయబోతున్నాం. మేము ఇక్కడ చికెన్ బదులు టర్కీ అనబడే సీమకోడిని ఉపయోగిస్తున్నాం. ఒకవేళ మీకు కూడా డిన్నర్ కి లేదా విందుకి ఈ రెసిపి ప్రయత్నించాలనుకుంటే, ఇది తప్పక అందరికీ నోరూరిస్తూ నచ్చుతుంది.

టర్కీ మరియు మష్రూమ్ పోట్ పై రెసిపి । సీమకోడి మరియు పుట్టగొడుగుల తయారీ । టర్కీ పోట్ పై ఎలా తయారుచేయాలి
టర్కీ మరియు మష్రూమ్ పోట్ పై రెసిపి । సీమకోడి మరియు పుట్టగొడుగుల తయారీ । టర్కీ పోట్ పై ఎలా తయారుచేయాలి
Prep Time
25 Mins
Cook Time
45M
Total Time
1 Hours10 Mins

Recipe By: పూజా గుప్తా

Recipe Type: ఒక కుండ భోజనం అందరికీ

Serves: ఇద్దరికీ

Ingredients
  • వెన్న -1 కప్పు

    పెద్ద ఉల్లిపాయ -1

    ర్యాషర్స్ స్ట్రీకీ బెకాన్ , తరిగినది -4

    చెస్ట్ నట్ పుట్టగొడుగులు, తరిగినవి -1 కప్పు

    సీమకోడి మిన్స్ ( తొడ భాగం మంచిది) -2 కప్పులు

    మైదాపిండి - ½ కప్పు

    చికెన్ స్టాకు -2 కప్పులు

    షీటు రెడీ- రోల్డ్ పఫ్ పేస్ట్రీ - ½ *375 గ్రాములు

    గుడ్డు సొన , కొట్టినది -1

    విల్టెడ్ స్ప్రింగ్ గ్రీన్స్

How to Prepare
  • పెద్ద బాండీలో వెన్నను వేడిచేయండి.

    ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ 8-10నిమిషాలు వేయించండి.

    బెకాన్ మరియు పుట్టగొడుగులను వేసి, గోధుమరంగులోకి మారేదాకా వండండి.

    సీమకోడి మాంసాన్ని చెక్క గరిటెతో ముక్కలు చేస్తూ వేయండి.

    గోధుమరంగులోకి మారేదాకా 5 నిమిషాల పాటు ఉడికించండి.

    మైదాపిండిని వేసి, 1 నిముషం కలపండి. తర్వాత చికెన్ స్టాకును, థైమ్ ను వేయండి.

    బాగా కలిపి, మధ్య మంటపై 1-2 నిమిషాలు ఉంచి గట్టిపడేదాకా ఉడికించండి.

    రుచికి కావాల్సినట్టు చేసుకుని, 10-15 నిమిషాలు పక్కనబెట్టి చల్లబడనివ్వండి.

    ఓవెన్ ను 220సి/220 సి ఫ్యాన్/గ్యాస్ 7 వేడి చేయండి.

    చల్లబడ్డాక, టర్కీ మిశ్రమాన్ని 2 రామెకిన్స్ లేదా చిన్న పై డిష్ లలో భాగాలు చేయండి.

    పేస్ట్రీని విడదీసి, 2 చతురస్రాలుగా కట్ చేసి పైన పెట్టండి.

    డిష్ చివర్లను వత్తి, గుడ్డుసొనతో అతికించండి.

    ఓవెన్ లో 30 నిమిషాలు బేక్ చేసి గోధుమరంగులోకి మారేదాకా వండండి.

    విల్టెడ్ స్ప్రింగ్ గ్రీన్స్ తో అలంకరించి వడ్డించండి.

Instructions
  • మీరు పోట్ పై కోసం టర్కీ బ్రెస్ట్ కూడా వాడవచ్చు
  • వంటక రుచి కోసం లీక్ కూడా జతచేయవచ్చు.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 పెద్ద ముక్క
  • క్యాలరీలు - 882
  • కొవ్వు - 51గ్రాములు
  • ప్రొటీన్ - 51 గ్రా
  • కార్బొహైడ్రేట్లు - 52 గ్రా
  • ఆహారంలో ఫైబర్ - 4గ్రా
[ 5 of 5 - 22 Users]
English summary

Turkey And Mushroom Potpie Recipe | Turkey Pie With Mushroom s Recipe | How To Prepare Turkey Potpie

Turkey and mushroom potpie is a traditional English recipe that is prepared as a one-pot meal. The minced turkey is cooked with mushrooms, onion, bacon and other ingredients and is place in between the puff pastry sheets. It is the baked into a delicious pie. Here is a recipe on how to make the turkey and mushroom potpie with a
Story first published: Saturday, December 23, 2017, 17:01 [IST]