Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఉప్పు చేప పప్పు చారు..రుచిలో దీనికి సాటి మరొకటి లేదు,ఎలా చేసుకోవాలంటే
చాలా సందర్భాలలో ఉప్పు చేప పప్పుచారు అనే పదం విని ఉంటాం. సినిమా పాటల్లో అయినా లేదా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు మెనూలో చూడటం ద్వారా ఇలా అనేక సందర్భాలలో ఈ పదం వింటుంటాం. వాస్తవానికి కోడికూర చిల్లుగారె మాదిరిగానే ఇది కూడా ఓ అద్భుతమైన కాంబినేషన్. ఉప్పు చేప పప్పు చారు అనేది ఒక సాంప్రదాయకమైన, రుచికరమైన వంటకం. ఇది ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది రుచికరమైనదే కాకుండా పోషకమైన ఆహారం కూడా. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శక్తిని అందిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉప్పు చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. పప్పులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. చింతపండులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది. కండరాలు, ఎముకలను బలపరుస్తుంది.ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేసే ఉప్పు చేప పప్పు చారుని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఉప్పు చేప పప్పు చారు తయారీకి కావలసిన పదార్థాలు
ఉప్పు చేప: 100 గ్రాములు
కందిపప్పు: 1 కప్పు
టమోటాలు: 2
ఉల్లిపాయలు: 1
పచ్చిమిర్చి: 4
చింతపండు: నిమ్మకాయ సైజు
కొత్తిమీర: 1 కట్ట
కరివేపాకు: 2 రెబ్బలు
ఆవాలు: 1 టీ స్పూన్
జీలకర్ర: 1/2 టీ స్పూన్
మెంతులు: 1/4 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
హైదరాబాదీ స్పెషల్ హలీం..దీని రుచికి సాటి మరేదీ ఉండదు,ఇంట్లోనే ఇలా చేసుకోండి
ఉప్పు చేప పప్పు చారు తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.
-తర్వాత ఉప్పు చేపను చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి 10-15 నిమిషాలు నానబెట్టాలి.
-ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి గుజ్జు తీయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేశాక అందులో ఆవాలు,జీలకర్ర,మెంతులు,కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-తర్వాత అందులో టమోటాలు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు వేయించిన తర్వాత ఇందులో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, తగినంత నీరు పోసి బాగా కలపాలి.
-తర్వాత అందులో ఉప్పు చేప ముక్కలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత కొత్తిమీర వేసి, 2-3 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఉప్పు చేప పప్పు చారు రెడీ. అన్నంలో వేడి వేడి ఉప్పు చేప పప్పు చారును తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




